లొల్లి చేస్తున్న ఉల్లి..
The bullet news (Nellore)- తినకముందే ఉల్లి సామాన్యులను కన్నీరు పెట్టిస్తోంది..వాటి ఆలోచన వస్తేనే గుండెల్లో అలజడి మొదలవుతోంది. నిన్నటి మొన్నటి దాకా సామాన్యులకు అందుబాటులో ఉన్న ఉల్లి నేడు మళ్లీ లొల్లి చేయడం మొదలు పెట్టింది. హాప్ సెంచరీని దాటి సెంచరీకి ఉరకలేస్తోంది.. పోయింది.. టమోటా వంటింట్లో స్రుష్టించిన ఇంకా చల్లారకముందే ఉల్లి భయపెడుతోంది..
నెల్లూరులో ఉల్లి ధరలకు రెక్కలొచ్చాయి.. నిన్న మొన్నదాకా టమోటా సామాన్యులను ఠారెత్తిస్తే తాజాగా ఉల్లి కంటి నీరు తెప్పిస్తోంది.. టమోటా దిగుమతి పెరగతుండటంతో క్రమంగా వాటి ధరల కూడా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. ఇంతలోనే ఉల్లి రూపంలో మరో ఉపద్రవం ముంచుకొచ్చి వంటింటి తలుపుతడుతోంది.. ప్రస్తుతం నిత్యవసరాలు పామాటను తలపిస్తున్నాయి.. ఎప్పుడూ ఆకాశాన్నంటుతాయో.. ఎప్పుడు పాతాళానికి చేరుతాయో తెలియక సామాన్యులు ఆందోళన చెందుతున్నారు..
ప్రస్తుతం మార్కెట్ లో ఉల్లి దర మార్కెట్ లో 50 కి పైనే పలుకుతోంది.. మరో కొద్ది రోజుల్లో 100కి చేరే అవకాశాలున్నాయి.. టమోటా ధర తగ్గుతోందన్న ఆనందాన్ని ఆశ్వాదించకముందే ఉల్లి బెంబేలెత్తిస్తోంది. ఒక్కరోజులో ఉల్లిధర ఐదారు రెట్లు పెరిగిపోయింది. వారం క్రితం కూడా ఉల్లిపాయల ధర రూ.10 నుంచి రూ.15 మధ్యే ఉండేది. ఇప్పడు ఒక్కసారిగా పెరిగిపోయింది. అమాంతం పెరిగిన ధర చూసి వినియోగదారులే కాదు మార్కెట్లలో ఉల్లిని విక్రయించే చిరు వ్యాపారులు కూడా షాక్ తింటున్నారు. రైతు బజార్లలో కూడా ఉల్లిధరల్లో ఘననీయంగా మార్పు కనిపించింది. అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ పరిణామం మార్కెట్లో కలకలం రేపుతోంది.

Reviewed by ADMIN
on
August 12, 2017
Rating:
No comments: