నెల్లూరులో ఏసీబీ డిజి పర్యటన
The bullet news (Nellore)- అక్రమ సంపాదన సొమ్మును ప్రజా సంక్షేమ పథకాలకు వెచ్చించాలని ప్రభుత్వానికి సిఫారసు చేశామని ఏసీబీ డిజి ఠాకూర్ తెలిపారు. నెల్లూరొచ్చిన ఆయన నూతనంగా నిర్మిస్తున్న ఏసీబీ కార్యాలయాన్నిసందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చేఏడాది కల్లా ఏసిబికి స్వంత భవనాలు నిర్మించుకుంటామన్నారు.. ఈనెల 14 న తిరుపతిలో సిఎం నూతనభావనాన్ని ప్రారంభిస్తారన్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉంటూ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న అధికారులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఊపేక్షించేది లేదన్నారు.. వారిపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామన్నారు..
నెల్లూరులో ఏసీబీ డిజి పర్యటన
Reviewed by ADMIN
on
August 12, 2017
Rating:
No comments: