నేరస్వభావం కల్గిన వ్యక్తి జగన్ - రాష్ట ఎక్సైజ్ శాఖామంత్రి జవహర్ పైర్
The bullet news (Nandyala)- వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు రాష్ట ఎక్సైజ్ శాఖామంత్రి జవహర్. నేర స్వభావం కల్గిన జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఓటేస్తే నంద్యాలలో రౌడీలు రాజ్యమేలుతారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. ప్రచారంలో భాగంగా సోమవారం నంద్యాలలోని ఒకటో వార్డు, పులిదిబ్బలో పర్యటించి టీడీపీ అభ్యర్ది బ్రహ్మనందరెడ్డిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్దించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి కలలు కన్న నంద్యాల కోసం ప్రతి ఒక్కరూ చేయి చేయి కలిపి భూమా బ్రహ్మనందరెడ్డిని అత్యదిక మెజార్టీతో గెలిపించాలన్నారు. టీడీపీని గెలిపిస్తే నంద్యాల అభివృద్ది చెందుతున్నారు.. ఈ క్రమంలోనే జగన్ పై విరుచుకుపడ్డారు. వైఎస్ రాజారెడ్డి నుంచి జగన్ వరకు ప్రతి ఒక్కరికీ నేరచరిత్ర ఉందన్నారు..రాష్ట రాజకీయాల్లో నేర చరిత్ర కల్గిన ఏకైక కుటుంబం వైఎస్ కుటుంబమేనన్నారు. దుర్మార్గానికి, హత్యా రాజకీయాలకు జగన్మోహన్ రెడ్డి కేరాఫ్ అడ్రస్ అన్నారు.. మంత్రి జవహర్ పర్యటించిన వార్డులో ఓటర్ల నుంచి భారీ స్పందన లభించడంతో ఆయన రెట్టింపు ఉత్సాహంతో వార్డుల్లో విసృతంగా పర్యటించారు..
నేరస్వభావం కల్గిన వ్యక్తి జగన్ - రాష్ట ఎక్సైజ్ శాఖామంత్రి జవహర్ పైర్
Reviewed by ADMIN
on
August 14, 2017
Rating:
javhar maata varhaala moota
ReplyDelete