రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ నివాస గృహలను కల్పించడమే టీడీపీ లక్ష్యం - ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్..
The bullet news (Uyyuru)- రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ నివాస గృహలను కల్పించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్ అన్నారు.. ఉయ్యూరు నియోజకవర్గంలోని కంకిపాడు మండలం, కుందేరులో ఏర్పాటు చేసిన ఎన్టీయార్ గృహప్రవేశ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.. పేదల కోసం ప్రభుత్వం నిర్మించిన ఎన్టీయార్ గృహలను ఆయన ప్రారంభించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నిరంతర శ్రామికునిగా రాష్ట్ర అభివృద్ది కోసం పనిచేస్తున్నారన్నారు. ప్రజలందరూ చంద్రబాబు నాయుడికి తోడ్పాటునందించలన్నారు. ఎమ్మెల్యే బోడెప్రసాదు మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ద్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కోనకళ్ళ బుల్లయ్య, గ్రామ సర్పంచ్ ఉదయకుమారి, చలసాని వెంకటేశ్వరరావు , కోటేశ్వరరెడ్డి, ఎంపీపీ దేవినేని రాజా తదితరులు పాల్గొన్నారు..
రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ నివాస గృహలను కల్పించడమే టీడీపీ లక్ష్యం - ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్..
Reviewed by ADMIN
on
October 02, 2017
Rating:
No comments: