ఇందిరాగాంధీ శత జయంతి ఉత్సవాలను విజయవంతం చెయ్యండి - యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మల్లి బాలకృష్ణ
THE BULLET NEWS (NELLORE)-ఇందిరాగాంధీ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 28 న యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించే జయంతి వేడుకలకు యూత్ కాంగ్రేస్ కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొని విజయవంతం చెయ్యాలని యూత్ కాంగ్రేస్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు మల్లి బాలకృష్ణ పిలుపునిచ్చారు.. నగరంలోని ఇందిరాభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు జిల్లా నుంచి అభిమానులు భారీగా పాల్గొని వేడుకలను విజయవంతం చేయాలని ఆయన కోరారు.. ఇదే సమయంలో తెలుగుదేశందేశం ప్రభుత్వ పాలనపై మండిపడ్డారు.. టీడీపీ నిరుద్యోగులను అడుగడుగునా మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతిని ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.. భృతి అమలు చెయ్యని పక్షంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహిస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.. ఈ సమావేశంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దామచర్ల శివ కుమార్ , జిల్లా ఉపాధ్యక్షులు వెంకటేష్, ప్రధాన కార్యదర్శి ఇబ్రహీం పాల్గొన్నారు...
ఇందిరాగాంధీ శత జయంతి ఉత్సవాలను విజయవంతం చెయ్యండి - యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మల్లి
బాలకృష్ణ
Reviewed by ADMIN
on
October 26, 2017
Rating:
No comments: