అక్షయపాత్ర పై ప్రభుత్వం పునరాలోచించాలి - ఎమ్మెల్యే కాకాణి
The Bullet News ( Manubolu) _విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించడంలో విఫల మౌతున్న 'అక్షయపాత్ర' ఫౌండేషన్ పై ప్రభుత్వం పునరాలోచించాలని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి కోరారు.. రెండు రోజుల క్రితం మనుబోలు జడ్.పి. హై స్కూల్ విద్యార్థులకు అక్షయ పాత్ర ఫౌండేషన్ అందించే భోజనం లో బల్లి పడిన నేపధ్యంలో ఇవాళ ఆయన మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించడంలో అక్షయ పాత్ర ఫౌండేషన్ విఫలమైందన్నారు.. మధ్యాహ్న భోజన నిర్వహణను దానికి అప్పగించడం పై ఆయన మండిపడ్డారు.. మధ్యాహ్న భోజన పథకం ఆ ఫౌండేషన్ కి అప్పగించినప్పటి నుంచి అనేక ఫిర్యాదులు అందుతున్నాయన్నారు.. ఇప్పటికే పలుమార్లు బల్లి పడిన భోజనాన్ని ఆ ఫౌండేషన్ సరఫరా చేసిందన్నారు.. దాని మీద నమ్మకం లేకే పిల్లలు ఇంటి నుంచి లంచ్ బాక్స్లు తీసుకొచ్చుకుం టున్నారన్నారు.. అక్షయ పాత్ర అలసత్వం పై జిల్లా కలెక్టర్ తో మాట్లాడనున్నట్లు ఆయన వెల్లడించారు.. గతంలో ఉన్న సంస్థల చేతే భోజనాన్ని సరఫరా చేసేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్నారు.. ఈ కార్యక్రమంలో మండల నాయకులు మహేంద్ర వర్మ, బిసి సెల్ అధ్యక్షులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు..
అక్షయపాత్ర పై ప్రభుత్వం పునరాలోచించాలి - ఎమ్మెల్యే కాకాణి
Reviewed by ADMIN
on
October 31, 2017
Rating:
No comments: