ఎమ్మెల్యే సహకారంతోనే అభివృద్ది - ఒకటో వార్డు కౌన్సిలర్ చెంగారావు...
The Bullet News (Venkata Giri)- వెంకటగిరి పట్టణ అభివృద్దే ధ్యేయంగా ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అహర్నిశలు శ్రమిస్తున్నారని పట్టణ ఒకటో వార్డు కౌన్సిలర్, పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షులు చెంగారావు తెలిపారు.. ఇవాళ బంగారు పేటలోని హరిజనవాడలో దాదాపు రూ. కోటీ 26లక్షల రూపాయలతో చేపట్టిన అభివృద్ది పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా కౌన్సిలర్ చెంగారావు మాట్లాడుతూ వెంకటగిరి మున్సిపాలిటీలోని బంగారుపేటని గతంలో ఎవ్వరూ అభివృద్ది చేయలేనంతగా ఎమ్మెల్యే సహకారంతో అభివృద్ది పనులు జరుగుతున్నాయన్నారు.. వెనుకబడిన ప్రాంతంగా ఉన్న ఒకటో వార్డును ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో రోడ్ల నిర్మాణం చేపట్టామన్నారు.. సబ్ ప్లాన్ నిధులకు సహకరించిన ఎమ్మల్యేకు చెంగారావు ధన్యవాదాలు తెలియజేయారు.. భవిష్యత్ లో మరింత అభివృద్ది చేస్తామన్నారు.. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులున్నారు..
ఎమ్మెల్యే సహకారంతోనే అభివృద్ది - ఒకటో వార్డు కౌన్సిలర్ చెంగారావు...
Reviewed by ADMIN
on
November 16, 2017
Rating:
It's a great website to all latest update &news
ReplyDelete