చేనేతకు చేయూత...
The Bullet News ( Venkat giri ) _అగ్నిప్రమాదంలో ఇంట్లో సామాగ్రి, ఉపాధి కోల్పోయిన ఉదయ్ కుమార్ కుటుంబాన్ని ఆదుకునేందుకు చేనేత సంఘ నాయకులు ముందుకొస్తున్నారు.. ఇవాళ ఉదయం కుటుంబాన్ని ఓదార్చి మున్సిపల్ చైర్ పర్సన్ దొంతు శారదా రూ. 3000 ఆర్థిక సాయం చెయ్యగా తాజాగా ప్రముఖ బిజినెస్ మాన్ బాధిత కుటుంబానికి అండగా నిలిచారు.. పిన్నమ్మ అయిన దొంతు శారదను వెంటబెట్టుకు వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు.. అనంతరం రూ. 5000 వేలు ఆర్థిక సాయం అందజేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడంలో దొంతు ఫ్యామిలీ ఎప్పుడూ ముందుంటుందన్నారు.. ప్రభుత్వం నుంచి కూడా సాయం అందేలా చూడాలని చైర్ పర్సన్ దొంతు శారదను ఆయన కోరారు.. దేవుని దయ వల్ల ఎలాంటి ప్రాణ నష్టం వాటిళ్లలేదన్నారు..
చేనేతకు చేయూత...
Reviewed by ADMIN
on
November 14, 2017
Rating:
No comments: