కేరళలో కదం తొక్కిన గూడూరు ఎబివిపి నాయకులు
The Bullet news (Kerala ) - ఒకరు కాదు.. ఇద్దరు కాదు..పది కాదు.. వంద కాదు..లక్షలాది మంది ఎబివిపి నాయకులు, కార్యకర్తలు కేరళ లో జరుగుతున్న హత్యా రాజకీయాలకు నిరసనగా రోడ్డెక్కారు..కేరళలోని త్రివేండ్రం రోడ్ల పై ఎబివిపి జెండాలతో భారీ ప్రదర్శన నిర్వహించారు.. గూడూరు ఏబీవీపీ కార్యకర్తలు.. నాయకులు కదంతొక్కారు.. ఏబీవీపీ చేపట్టిన ఛలో కేరళ కార్యక్రమం విజయవంతమైంది.. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి మల్లికార్జున మాట్లాడుతూ కేరళలో కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమాయకపు ఎబివిపి కార్యకర్తలను, అర్ ఎస్ ఎస్ నాయకులను అమానుషంగా అంత మొందిచారన్నారు.. కేరళలో జరుగుతున్న హత్యాకాండలు ఆపాలని ఎబివిపి 3 లక్షల మందితో భారీ ర్యాలీ చేస్తున్నామన్నారు.. కమ్యూనిస్టులకు ఎదురుతిరిగినందుకు హత్యలు చెయ్యడం దారుణమన్నారు.. దాదాపు 357 మందిని కమ్యూనిస్టులు పొట్టన పెట్టుకున్నారని మల్లికార్జున్ ఆరోపించారు.. భారీ బహిరంగ సభలో గూడూరు ఎబివిపి నగర కార్యదర్శి చిన్న , సూర్య ,శశి ,కోటయ్యతో పాటు మరో 40మంది పాల్గొన్నారు..
కేరళలో కదం తొక్కిన గూడూరు ఎబివిపి నాయకులు
Reviewed by ADMIN
on
November 11, 2017
Rating:
No comments: