లోకేష్ పై పోసాని పైర్.. క్షమాపణ చెప్పాలని డిమాండ్
The bullet news (Hyderabad)- ఇటీవల ఎపి ప్రకటించిన నంది అవార్డులను రద్దు చేయాలని ప్రముఖ దర్శకుడు, నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి డిమాండ్ చేశారు. ఎపి నంది అవార్డుల ప్రదానంపై సినీ, రాజకీయ ప్రముఖులు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం పోసాని స్పందించారు. నంది అవార్డుల విషయంలో ఎపి మంత్రి లోకేష్ చేసిన వ్యాఖ్యలపై పోసాని తీవ్రంగా స్పందించారు. లోకేష్ ఎపి మంత్రి కావడం ప్రజల ఖర్మ అని ఆయన పేర్కొన్నారు. అసలు లోకేష్ కు బుద్ధి ఉందా అని ధ్వజమెత్తారు. తాము ఎన్‌ఆర్‌ఎలమైతే లోకేష్ ఎవరని ఆయన ప్రశ్నించారు. ఎపి ప్రజలను తెలంగాణ సిఎం కెసిఆర్ ఎన్నడూ తిట్టలేదని ఆయన గుర్తు చేశారు.
ఎపి రాజకీయ నేతలనే ఆయన తిట్టారని చెప్పారు. ఈ విషయంలో తెలంగాణ ప్రజలకు, సిఎం కెసిఆర్‌కు పాదాబివందనం చేస్తున్నాని ఆయన స్పష్టం చేశారు. లోకేష్ సిఎం అయితే తాము తెలుగు రోహింగ్యాలమవుతామని ఆయన చెప్పారు. తాము తెలంగాణలో పన్నులు కడితే ఎపి గురించి మాట్లాడకూడదా అని పోసాని ప్రశ్నించారు. లోకేష్ కూడా తెలంగాణలో ఇల్లు కట్టుకున్నాడని, ఆయనకు ఇక్కడ వ్యాపారాలు కూడా ఉన్నాయని, మీరు కూడా పన్ను కడుతున్నారంటూ లోకేష్‌పై ఆయన మండిపడ్డారు. తెలంగాణ సిఎం కెసిఆర్‌ను చూసి ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలని ఆయన లోకేష్‌కు సూచించారు.
నంది అవార్డుల విషయంలో గత ప్రభుత్వాలను చంద్రబాబు విమర్శించిన సందర్భాలు ఉన్నాయన్నారు. టెంపర్ చిత్రానికి గాను తనకొచ్చిన నంది అవార్డును స్వీకరించనని ఆయన తేల్చి చెప్పారు. ఒకవేళ తాను అవార్డును అందుకుంటే కమ్మోడు కాబట్టి అవార్డు ఇచ్చారని అనుకుంటారని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు పేర్కొన్నట్టు ఐవిఆర్‌ఎస్ ద్వారా నంది అవార్డులు ఇస్తే, అప్పుడు తాను అవార్డు తీసుకుంటానని పోసాని తేల్చి చెప్పారు.

Reviewed by ADMIN
on
November 21, 2017
Rating:
No comments: