రైతుల శ్రేయస్సును విస్మరిస్తున్న తెలుగుదేశం ప్రభుత్వం - సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి
THE BULLET NEWS (SARVEPALLI)-దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ముందుచూపుతో ప్రారంభించిన ప్రాజెక్టులను పూర్తి చేయడంలో తెలుగుదేశం ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సర్వేపల్లి ఎమ్మెల్యే, వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్దన్ రెడ్డి మండిపడ్డారు.. ఇవాళ వెంకటాచలం, కనుపూరు చెరువులను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కాకాణి గోవర్దన్ రెడ్డి మాట్లాడుతూ కనుపూరు కాలువలో నీరు లేకపోవడం వల్ల గతంలో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు.. ఆ ఘటన పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ఇరిగేషన్ అధికారులుమీదుందన్నారు.. ఒక్క ఎకరా కూడా పంట ఎండిపోకుండా చూడాలన్నారు. రాజశేఖర్ రెడ్డి రైతు సంక్షేమం కోసం, వారి శ్రేయస్సు కోసం నిరంతరం ఆలోచించేవాడన్నారు..ఆయన చనిపోయిన ఎనిమిదేళ్లు గడుస్తున్నా ఆయన శంకుస్థాపన చేసిన ఏ ఒక్క ప్రాజెక్టును టీడీపీ పూర్తి చేసిన దాఖలాల్లేవన్నారు.. రాజశేఖర్ రెడ్డి దయ వల్లే కండలేరు లిప్ట్ ఇరిగేషన్, సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీ, కనుపూరు మోడలైజేషన్ మంజూరయ్యాయన్నారు.. ప్రస్తుతం తెలుగుదేశం హయాంలో నిధులు లేక ప్రాజెక్టులు ఆగిపోయాయని విమర్శించారు.. నీరు- చెట్టు పథకానికి అధికారులు నిదులు విడుదల చేస్తున్నారని, ప్రాజెక్టులు పూర్తవడానికి మాత్రం మంజూరు చేయడంలేదన్నారు.. నిధులు లేకపోవడం వల్లే సంగం బ్యారేజీ పనులు ఆగిపోయాయన్నారు.. కనుపూరు కాలువను పూర్తిస్థాయిలో నిర్మాణాలు చేపడితే ఎక్కడా సాగునీటి సమస్య ఉండదన్నారు.. జిల్లాలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టుల పూర్తి చేయడం కోసం ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తున్నామన్నారు.. ఆయన వెంట స్థానిక నాయకులున్నారు..
No comments: