వైసీపీలోకి కొత్త ముఖాలు..
The bullet news (Hindhupuram)- ఎన్నికలు సమీపిస్తున్ నేపథ్యంలో వైసీపీలో కొత్త ముఖాలు తెరపైకొస్తున్నాయా..? రాష్ట వ్యాప్తంగా గెలుపుగుర్రాలకు టిక్కెట్లు ఇచ్చేందుకు జగన్ అండ్ కో సిద్దమైందా..? గ్రౌండ్ ప్లాన్ కు కూడా రెఢీ చేస్తోందా..? హిందూపురం రాజకీయాలను గమనిస్తే ఈ ప్రశ్నలన్నింటికి అవుననే సమాధానమొస్తోంది.. తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న హిందూపురం నియోజకవర్గంలో వైసీపీకి జీవంపోసిన నాయకుడు నవీన్ నిశ్చల్ .. బలిజ సామాజికవర్గానికి చెందిన నవీన్ నిశ్చల్ హిందూపురం వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. ఇక్కడ పార్టీని బలోపేతం చేయడం కోసం ఎంతో శ్రమించారు. గత ఎన్నికల్లో బాలయ్యబాబుపై పోటీచేసిన నవీన్ నిశ్చల్ స్వల్ప మెజార్టీతో ఓటమిపాలయ్యారు.. సహజంగానే తెలుగుదేశం పార్టీకి హిందూపురం కంచుకోట. నందమూరి తారకరామారావు కుటుంబానికి ఇక్కడి ప్రజలు నేటికీ బ్రహ్మరథం పడుతూనే ఉన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న నవీన్ నిశ్చల్.. రాష్ర్ట విభజన తర్వాత వైసీపీలో చేరారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పటికీ గ్రామస్థాయి నుంచి బలమైన క్యాడర్‌ను తయారుచేసుకుంటూ వచ్చారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి నవీన్ గట్టిపోటీ ఇస్తారనే ప్రచారం సాగుతోంది.
ఇదిలా ఉంటే... వైసీపీ అధిష్టానం చేస్తున్న ప్రయోగాలకు నవీన్ బలిపశువుగా మారే పరిస్థితి ఏర్పడబోతోందట. ఈ విషయం గురించి పార్టీ క్యాడరే మాట్లాడుకుంటోంది. అనంతపురం జిల్లా ఇన్‌ఛార్జ్‌గా ఉన్న రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి.. హిందూపురంలో నవీన్‌ని తప్పించాలని ఆలోచిస్తున్నారట. ఇక్కడ వాల్మీకి సామాజికవర్గానికి చెందిన అంబికా లక్ష్మీనారాయణను పార్టీలోకి ఆహ్వానించి టిక్కెట్ ఇవ్వాలని భావిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
హిందూపురంలో వాల్మీకులు అధికంగా ఉన్నారు. ఈ కారణంగా ఇక్కడ అంబికా లక్ష్మీనారాయణ ధీటైన అభ్యర్థి అవుతారన్నది మిథున్‌రెడ్డి అభిప్రాయంగా ఉంది. అందుకే ఈ దిశగా ఆయన పావులు కదుపుతున్నట్లు వినికిడి! ప్రస్తుతం అంబికా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు. అయితే ఆయన అంత చురుకుగా వ్యవహరించడం లేదు. అంబికాను పార్టీలోకి తెస్తే బాలయ్యపై గట్టిపోటీ ఏర్పడుతుందని వివిధ సర్వేలలో తేలిందట. ఈ సమాచారంతోనే మిథున్ చక్రం తిప్పాలని భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో నవీన్ నిశ్చల్‌ను పక్కన పెట్టేందుకు మిథున్‌రెడ్డి సిద్ధపడుతున్నట్లు సమాచారం. నవీన్‌ని తప్పిస్తే పార్టీ క్యాడర్ మొత్తం దూరమయ్యే అవకాశముందని ద్వితీయశ్రేణి నేతలు హెచ్చరిస్తున్నారు.
అనేక సందర్భాల్లో హిందూపురంలో ప్రజాసమస్యలపై పెద్దఎత్తున పోరాటంచేసిన నవీన్ నిశ్చల్‌కు కిందిస్థాయిలో మంచి పట్టు ఉంది. ఈ తరుణంలో నవీన్‌ను మార్చితే మొత్తం కార్యకర్తలు వైసీపీకి రాంరాం చెప్పే ప్రమాదముందట. ఒకవేళ అంబికా లక్ష్మీనారాయణను తీసుకువస్తే.. నవీన్ నిశ్చల్ పవన్ కల్యాణ్ ఏర్పాటుచేసిన జనసేనలో చేరతారనీ, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున బరిలోకి దిగుతారనీ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇన్నాళ్లుగా వైసీపీ కోసం కష్టపడిన తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పార్టీ పక్షానే పోటీచేస్తానని నవీన్ చెబుతున్నారు. చూడాలి మరి.. ఈ పరిణామం ఎటు దారితీస్తుందో!

Reviewed by ADMIN
on
November 23, 2017
Rating:
No comments: