ఘోర విమాన ప్రమాదం... 20మంది సజీవ దహనం..
The bullet news(aeroplane)- నేపాల్ రాజధాని ఖాట్మండులో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్యాసెంజర్ విమానం ల్యాండ్ అవుతూనే ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. విమానం కూలిపోయిన వెంటనే మంటలు చెలరేగడంతో విమానాశ్రయ పరిసరాల్లో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 20 మంది సజీవ దహనం అయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. బంగ్లాదేశ్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన ఈ విమానం ప్రమాదానికి గురైన సమయంలో మొత్తం 67 మంది ప్రయాణిస్తున్నారు.
అప్రమత్తమైన అధికారులు హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. కాగా ఇప్పటికి 17 మందిని సురక్షితంగా బయటికి తీసుకువచ్చినట్టు తెలుస్తోంది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:20 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్టు చెబుతున్నారు. ప్రస్తుతం విమానాశ్రయంలో రాకపోకలను నిలిపివేసి ముమ్మరంగా సహాయక కార్యక్రమాలు చేపట్టారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
ఘోర విమాన ప్రమాదం... 20మంది సజీవ దహనం..
Reviewed by ADMIN
on
March 12, 2018
Rating:
No comments: