పడిగాపులు!
The bullet news(nellore) - జిల్లాలో పండుటాకులకు రేషన్ సరుకులు అందడంలేదు. ఈ-పోస్ యాంత్రాల్లో వారి వేలి ముద్రలు నమోదు కావడంలేదు. ఐరిస్ పరికరాలు కనుపాపలను గుర్తించని దుస్థితి ఎదరైంది. ఆధార్ సంస్థ తన సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయడం, అందుకు అనుగుణంగా ఈ-పోస్ యంత్రాలను తీర్చిదిద్దకపోవడంతో ఐరిస్ పరికరాలు సక్రమంగా పనిచేయడంలేదు. యంత్రాల్లో వేలిముద్రలు నమోదు కాని వృద్ధులైన లబ్ధిదారుల కనుపాపలను పరీక్షించి రేషన్ పింపిణీ చేయలేకపోతున్నారు. ఈ తరహా సమస్యలు ఇటీవల అధికమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న 70 ఏళ్లు దాటిన వృద్ధుల్లో 50 శాతం వృద్ధుల్లో ఈ సమస్య తలెత్తుతోంది. వారు రేషన్ దుకాణాలు, అధికారులు, స్థానిక నేతల చుట్టూ నెలల తరబడి తిరుగుతున్నా.. ఈ సమస్య మాత్రం పరిష్కారం కాకపోగా పెరుగుతున్న వైనంపై ఈ కథనం. నెల్లూరు నగరం, గ్రామీణం, గూడూరు, నాయుడుపేట, సూళ్లూరుపేట, ఆత్మకూరు, కావలి తదితర నియోజకవర్గాల్లోని మండలాల్లో ఎనలాజిక్స్ కంపెనీకి చెందిన సుమారు 750 ఈ-పోస్ యంత్రాలున్నాయి. అవి సక్రమంగా పనిచేయకపోవడం, ఐరీస్ పరికరాలు మనుగడలో లేవు. వీటిని మార్చాల్సిన ఉన్నతాధికారులు పట్టించుకోవడంలేదు. అందువల్ల జిల్లాలోని పలు మండల పరిధిలోని రేషన్ దుకాణాల ద్వారా సరుకులు తీసుకునే వృద్ధులకు సమయానికి సరుకులు అందడంలేదు. వృద్ధుల్లో ఎక్కువ మంది వీటిపైనే ఆధారపడి ఉన్నారు. వేలిముద్రలు పడకపోవడం, ఈ-పోస్ యంత్రాలు పనిచేయక, ఐరీస్ పరికరాలు మనుగడలో లేకపోవడంతో జిల్లా వ్యాప్తంగా ఈ మూడు నెలలుగా వేలాది మంది వృద్ధులు రేషన్ సరుకులు తీసుకోలేకపోతున్నారు. ఈవిషయమై ఆయా వృద్ధులు, కుటుంబ సభ్యులు స్థానిక అధికారుల వద్దకు వెళ్లడం, వారు పనిచేయకపోతే ప్రతి సోమవారం మండల కేంద్రాల్లో జరిగే ప్రజావిజ్ఞప్తుల కార్యక్రమాలకు వెళ్లి తహసీల్దార్లకు వినతులు ఇవ్వడం పరిపాటిగా మారింది. గతంలో డీఎస్‌వోగా పనిచేసిన ధర్మారెడ్డికి ఈ సమస్యను పరిష్కరించాలని ఉన్నతాధికారులు ఆదేశించినా ఆయన పట్టీపట్టనట్లు వ్యవహరించడంతో ప్రస్తుతం జిల్లాలోని వృద్ధులకు రేషన్ అందడంలేదని అంటున్నారు. ఈవిషయంలో మూడు నెలలుగా సమస్యలు ఎక్కువ వస్తుండడంతో జేసీ ఇంతియాజ్‌నే ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఎక్కడికక్కడ సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకున్నారు. స్థానిక వీఆర్‌వోలు వేలి ముద్రలతో వారికి రేషన్ ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు. జేసీ ఆదేశించినప్పుడు మాత్రం రెవెన్యూ అధికారులు కూడా ప్రత్యేక శ్రద్ధతో రేషన్ ఇచ్చే 15 రోజుల్లో (1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు) కేవలం నాలుగు, ఐదు రోజులు మాత్రమే స్థానిక రేషన్ దుకాణాలవద్ద ఉంటూ వృద్ధులకు సాయం చేసేవారు. ఆ తర్వాత ముఖం చాటేసేవారు. ఎవరైనా స్థానిక నేతలు ఎందుకిలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నిస్తే మాత్రం.. తమ ఉన్నతాధికారులు వేరే పనులు పురమాయించారని, తామేం చేయలేం అంటూ సమాధానం ఇచ్చేవారు. రేషన్ సరుకులు ఇచ్చే 15 రోజుల్లో సుమారు వారం రోజులు వారు అందుబాటులో ఉంటే.. మిగతా 8 రోజులు వృద్ధులు వారికోసం రేషన్ దుకాణాల వద్ద పడిగాపులు కాసేవారు. ఈ పరిస్థితిలో మాత్రం నేటికీ మార్పు రాలేదు. - ఇంతియాజ్, జిల్లా సంయుక్త కలెక్టరు
వేలిముద్రలు, ఐరీస్ సమస్యలవల్ల కొందరు వృద్ధులు రేషన్ సరుకులు అందుకోలేకపోతున్నారన్నది వాస్తవం. తమ దృష్టికి వచ్చిన సమస్యలను తక్షణం పరిష్కరిస్తున్నాం. ఆధార్ సంస్థ తన సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయడంతో దానికి అనుగుణంగా ఈ-పోస్ యంత్రాలను తీర్చిదిద్దడంలో ఇబ్బందులున్నాయి. ఈపోస్ యంత్రాలను కూడా మార్చేలా చర్యలు తీసుకుంటాం. ఎక్కడైనా ఈ తరహా సమస్యలు వచ్చి, వృద్ధులు, వికలాంగులు సరుకులు తీసుకోలేని స్థితిలో ఉంటే స్థానిక తహసీల్దార్లకు సమాచారం అందిస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం.
వేలిముద్రలు, ఐరీస్ సమస్యలవల్ల కొందరు వృద్ధులు రేషన్ సరుకులు అందుకోలేకపోతున్నారన్నది వాస్తవం. తమ దృష్టికి వచ్చిన సమస్యలను తక్షణం పరిష్కరిస్తున్నాం. ఆధార్ సంస్థ తన సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయడంతో దానికి అనుగుణంగా ఈ-పోస్ యంత్రాలను తీర్చిదిద్దడంలో ఇబ్బందులున్నాయి. ఈపోస్ యంత్రాలను కూడా మార్చేలా చర్యలు తీసుకుంటాం. ఎక్కడైనా ఈ తరహా సమస్యలు వచ్చి, వృద్ధులు, వికలాంగులు సరుకులు తీసుకోలేని స్థితిలో ఉంటే స్థానిక తహసీల్దార్లకు సమాచారం అందిస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం.
పడిగాపులు!
Reviewed by ADMIN
on
March 12, 2018
Rating:
No comments: