నిత్యం మోసం.. నిలదీస్తేనే అంతం
The bullet news(nellore)- మార్కెట్లో కూరగాయలు కొన్నా.. చౌకదుకాణాల్లో సరకుల కోసం వెళ్లినా.. పెట్రోలు బంక్‌లో పెట్రోలు పట్టించుకున్నా.. ఆన్‌లైన్‌లో వస్తువులు కొనుగోలు చేసినా ఇలా ప్రతీచోట నిత్యం వినియోగదారుడు మోసపోతూనే ఉన్నాడు. అన్యాయమని తెలిసినా సామాన్యుడు మౌనంగానే భరిస్తున్నాడు. అధికారులను ఆశ్రయించేవారు కొద్దిమంది మాత్రమే. అధికారులు దాడులు చేస్తున్నా మోసాలు మాత్రం తగ్గడం లేదు. ప్రజల్లో అవగాహనతోనే ఈ మోసాలకు అడ్డుకట్ట పడుతుంది. మార్చి 15న వినియోగదారుల హక్కుల పరిరక్షణ దినం సందర్భంగా ఆ వివరాలు..ః జిల్లాలో 1,896 చౌకదుకాణాలున్నాయి. 2.27 లక్షల కార్డుదారులున్నారు. కుటుంబసభ్యుల ఆధారంగా 10 కేజీల నుంచి 25 కేజీల వరకు బియ్యం, ఇతర సరకులు అందిస్తున్నారు. ఎలక్ట్రానిక్ యంత్రాలతో తూకం వేస్తున్నారు. అయితే తూకంలో మోసం వల్ల 20 కేజీల బియ్యానికి 16 మాత్రమే వస్తున్నాయి. తూకాల మోసాలపై దాడులు చేసిన అధికారులు ఇటీవల 83 మంది డీలర్లపై కేసులు నమోదు చేశారు.
నిత్యం నెల్లూరులోని ఏసీ కూరగాయల మార్కెట్టులో నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూరగాయలు కొనుగోలు చేస్తుంటారు. ఇక్కడ కొన్న కూరగాయల్లో కిలోకూ 400 గ్రాముల వరకు కోత పడుతోంది. ఇటీవల అధికారులు చేసిన దాడుల్లో ఇది బయటపడింది. తూకం మోసాలకు పాల్పడుతున్న తొమ్మిది మందిపై కేసులు కూడా నమోదు చేశారు. ఇక్కడ నిబంధనలు ఎవ్వరూ పట్టించుకోవడం లేదు.
పెట్రోలు బంకుల్లో..
జిల్లాలో 214 పెట్రోలు బంకులు ఉన్నాయి. ప్రజలకు పెట్రోలు నిత్యావసరంగా మారింది. బంకు యజమానులు నిబంధనలు పాటించడం లేదు. నాణ్యత లోపం, రీడింగ్‌లో మాయాజాలం చేస్తున్నారు. వినియోగదారుడు కనిపెట్టలేని విధంగా మోసాలకు పాల్పడుతున్నారు.
ఆన్‌లైన్ మోసాలపై..
ఇటీవల పలువురు చరవాణుల ద్వారా ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే సమయంలో ఆ సంస్థ నిబద్దత తెలుసుకోవాలి. వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకుంటే మోసాలకు దూరంగా ఉండవచ్చు. ఆన్‌లైన్ వ్యాపారాలపై కేంద్ర ప్రభుత్వం జీవో 629ని విడుదల చేసింది. దీని ప్రకారం అధికారులు చర్యలు తీసుకుంటారు థామస్ రవికుమార్, తూనికలు కొలతల శాఖ సహాయ కమిషనర్
రేషన్ సరకులు, పెట్రోలు బంకులు, కూరగాయలు, ఇతర ఎలాంటి వస్తువుల కొనుగోళ్లలోనైనా మోసపోయామని అనుమానం వస్తే వ్యాపారులను నిలదీయాలి. అధికారులకు ఫిర్యాదు చేయాలి. వెంటనే స్పందించి న్యాయం చేస్తాం. మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు వినియోగదారుడికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటాం.

Reviewed by ADMIN
on
March 15, 2018
Rating:
No comments: