‘జీవితంలో అతి పెద్ద ప్రామిస్ చేయాల్సి వచ్చింది’
The bullet news (Cinema)- చిన్నప్పుడు మా అమ్మ నాకు ఓ మాట చెప్పింది. ఒకసారి ప్రామిస్ చేసి ఆ మాట తప్పితే యు ఆర్ నాట్ కాల్డ్ ఎ మ్యాన్ అని. ఎప్పటికీ ఆ మాట తప్పలేదు, మర్చిపోలేదు. నా జీవితంలోనే అతి పెద్ద ప్రామిస్ చేయాల్సిన రోజు ఒకటి వచ్చింది. పెద్దదే కాదు కష్టమైంది కూడా.. ‘భరత్ అనే నేను’..’ అని ప్రమాణం చేస్తున్నారు మహేశ్‌బాబు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘భరత్ అనే నేను’. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. కైరా అడ్వాణీ కథానాయిక. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సినిమాను నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నారు.
‘భరత్ విజన్’ అంటూ ఈ సినిమా టీజర్‌ను చిత్ర బృందం మంగళవారం సాయంత్రం విడుదల చేసింది. ఇందులో మహేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తూ కనిపించారు. ఆయన గెటప్ మాత్రం ఓ రాజకీయ నాయకుడిలా లేకుండా చాలా స్టైలిష్‌గా ఉంది.
‘కానీ.. ఎంత కష్టమైనా ఆ మాట కూడా తప్పలేదు. బికాజ్ ఐ యామ్ ఎ మ్యాన్ (ఎందుకంటే నేను మనిషిని). విఆర్ లివింగ్ ఇన్ ఎ సొసైటీ (మనం సమాజంలో నివసిస్తున్నాం). ప్రతి ఒక్కళ్లకి భయం, బాధ్యత ఉండాలి.. ప్రామిస్’ అంటూ మహేశ్ చెప్పే డైలాగ్ మొత్తం టీజర్‌కు హైలైట్‌గా నిలిచింది. ఈ ప్రచార చిత్రం సినిమాపై అంచనాలను బాగా పెంచేసింది. ఈ చిత్రంలో మహేశ్ పూర్తి పేరు ‘భరత్ రామ్’. ఏప్రిల్ 20న ‘భరత్ అనే నేను’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
‘జీవితంలో అతి పెద్ద ప్రామిస్ చేయాల్సి వచ్చింది’
Reviewed by ADMIN
on
March 06, 2018
Rating:
No comments: