వైఎస్‌ఆర్ బయోపిక్‌లో నయనతార
The bullet News (Cinema)- ఎన్టీఆర్ బయోపిక్‌కి చర్చలు నడుస్తున్న తరుణంలో తెరపైకి వైఎస్‌ఆర్ కూడా వచ్చారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న తెలుగు రాష్ట్రాన్ని రెండు సార్లు పాలించిన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అకాల మరణం చెందారు. ఇప్పుడు ఆయనపై కూడా బయోపిక్‌ని తీయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆనందో బ్రహ్మ చిత్రంతో సక్సెస్ సాధించిన దర్శకుడు మహి రాఘవ డైరక్షన్లో ఈ చిత్రం రాబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం నటీ నటుల వేటలో ఉన్న ఈ చిత్రానికి వైఎస్ ఆర్ పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టిని తీసుకోవాలని అనుకున్నట్లు తెలుస్తోంది. అయితే మమ్ముట్టి సరసన నయన్‌ని ఎంపిక చేసే ఆలోచనలో ఉంది చిత్ర యూనిట్. నయనతార చిరంజీవి పక్కన హీరోయిన్‌గా సైరాకి కూడా సైన్ చేసింది. పలు తమిళ చిత్రాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడికి తెలుగులో అభిమానులు బాగానే ఉన్నారు. అదే వైఎస్ ఆర్ చిత్రంలో ఎంపికకు దారి తీసింది.
వైఎస్‌ఆర్ బయోపిక్‌లో నయనతార
Reviewed by ADMIN
on
March 08, 2018
Rating:
No comments: