లెక్చరర్‌పై ఓ విద్యార్థి కాల్పులు...


THE BULLET NEWS (CHANDIGARH)-హరియాణాలో దారుణం చోటు చేసుకుంది. ఓ విద్యార్థి.. లెక్చరర్‌పై కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో లెక్చరర్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది.
సోనిపట్ జిల్లాలోని ఖార్‌ఖోడా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం కళాశాలకు వచ్చిన విద్యార్థిని తుపాకీతో లెక్చరర్‌పై కాల్పులు జరిపినట్లు సమాచారం. విద్యార్థి పరారీలో ఉన్నాడని.. త్వరలోనే అతన్ని పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. ఘటనకు గల కారణాలు, మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.
గుర్‌గ్రామ్ లో బాద్‌షాపూర్‌లో నివసించే దంపతులపై గుర్తు తెలియని ఆగంతకులు కాల్పులు తెగబడ్డారు. ఈ దాడిలో భర్త తీవ్రంగా గాయపడగా.. ఆస్పత్రికి తరలించే క్రమంలో మృతి చెందాడు. ఇక స్వల్ప గాయాలతో బయటపడిన భార్య ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనలో టిల్లు అనే రౌడీ షీటర్ హస్తం ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. పరారీలో ఉన్న టిల్లు కోసం గాలింపు చేపట్టినట్లు చెప్పారు.
లెక్చరర్‌పై ఓ విద్యార్థి కాల్పులు...
Reviewed by ADMIN
on
March 13, 2018
Rating:
No comments: