జైళ్లల్లో వైద్య సదుపాయాలు పెంచేందుకు కృషి- సుష్మా సాహు
The bullet news (Nellore)- సుప్రీం కోర్టు గైడ్ లెన్స్ ప్రకారం జైళ్లలో మౌలిక వసతులు కల్పనకు క్రుషి చేస్తున్నట్లు జాతీయ మహిళా కమిషనర్ మెంబర్ సుష్మా సాహు అన్నారు.. నెల్లూరు మహిళా జైలును సందర్శించిన సుష్మా.. అక్కడి మౌలిక వసతులపై ఆరా తీశారు. మహిళా జైళ్లలో వైద్య సదుపాయాలు పెంచేందుకు కేంద్రానికి సిఫారసు చేస్తున్నామన్నారు.. ఒక్కో జైలుకు ఒక్కో హాస్పటల్ ఉండాలన్నారు..సెక్సువల్ హెరాస్ మెంట్, వరకట్న వేధింపులు, యాసిడ్ దాడులు వంటివి ఏపీలో చాలా తక్కువగా నమోదయ్యాయన్నారు.. నెల్లూరు, విజయవాడ జైళ్లను సందర్శించానని, నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేయనున్నట్లు సుష్మా సాహు తెలిపారు.
జైళ్లల్లో వైద్య సదుపాయాలు పెంచేందుకు కృషి- సుష్మా సాహు
Reviewed by ADMIN
on
March 13, 2018
Rating:
No comments: