ప్రధాని అనుమతితోనే వైసీపీ అవిశ్వాస తీర్మానం - ఎమ్మెల్సీ బీదా కామెంట్
The bullet news (Nellore)- అవిశ్వాసం పేరుతో వైసీపీ నీచ రాజకీయాలకు పాల్పడుతూ ఏపీ ప్రజలను మోసం చేస్తోందని నెల్లూరు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర మండిపడ్డారు.. ప్రధాని నరేంద్రమోడీ అనుమతితో వైసీపీ అవిశ్వాసం తీర్మానం పెట్టిందంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.. నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో మీడియాతోమాట్లాడుతూ ఆయన వైసీపీపై మండిపడ్డారు.. మోడీపై నమ్మకం ఉందనే వైసీపీ నేతలు కేంద్ర ప్రభుత్వంపై ఎందుకు అవిశ్వాస తీర్మానం పెట్టారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.. రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం కోసమే కేంద్రంలో నుంచి బయటకు వచ్చామని బీదా స్పష్టం చేశారు.. ఏపీలో మాతో పొత్తు పెట్టుకుని, తెలంగాణలో పార్టీని నిర్మూలించడానికి బీజేపీ ప్రయత్నించిందని ఆరోపణలు చేశారు.. వైసీపీ నేతలు ప్రధానిని కలవాలంటే అపాయింట్ మెంట్ ఇస్తున్నారని ముఖ్యమంత్రి కలవాలంటే మాత్రం అపాయింట్మెట్ ఇవ్వడం లేదని ఆయన మండిపడ్డారు.. ప్రత్యేకహోదా, అవినీతి గురించి మాట్లాడే అర్హత పవన్ కళ్యాణ్ కు లేదన్నారు.. బిజేపీ ఆడుతున్న నాటకంలో పవన్ ఓ పావుంటూ ఆయన విమర్శించారు..
ప్రధాని అనుమతితోనే వైసీపీ అవిశ్వాస తీర్మానం - ఎమ్మెల్సీ బీదా కామెంట్
Reviewed by ADMIN
on
March 17, 2018
Rating:
No comments: