అజ్ఞాతవాసి ఎవరు?
The bullet news(vekatachalam)- వెంకటాచలం మండలంలోని రామదాసుకండ్రిగ గ్రామంలో కలకలం రేపిన నకిలీ పట్టాలపై రెవెన్యూ అధికారులు బుధవారం విచారణ చేపట్టారు. ఆ పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 2198, 2199లోని 8.16 ఎకరాల సీజేఎఫ్‌ఎస్ భూములకు ప్రభుత్వం తమ పూర్వీకులకు పట్టాలు ఇచ్చిందని నలుగురు వ్యక్తులు, సర్వే నెంబర్ 2300లో ఐదుగురు వ్యక్తులు 5.59 ఎకరాలకు మొత్తం 9 మంది 13.75 ఎకరాలకు నకిలీ పట్టాలు సృష్టించారు. ఈ పత్రాలను అధికారులకు సమర్పించి ఈ భూములను ఏపీఐఐసీ వారు తీసుకుని ప్రభుత్వం ద్వారా పరిహారం ఇప్పించాలని దరఖాస్తు చేసుకున్నారు. ఈ నకిలీ పట్టాల భాగోతాన్ని ‘ఈనాడు’ బట్టబయలు చేసింది. పత్రాలు నకిలీవని ఆధారాలతో సహా నిరూపిస్తూ వరుస కథనాలు ‘ఈనాడు’లో ప్రచురితమయ్యాయి. దీంతో స్పందించిన జిల్లా కలెక్టర్ ఆ పత్రాలపై విచారణకు ఆదేశించారు. ఆ మేరకు బుధవారం వెంకటాచలం తహసీల్దార్ సోమ్లానాయక్, ఏపీఐఐసీ జిల్లా మేనేజర్ భాను, సర్వేయర్ సుబ్బరాయుడులు రామదాసుకండ్రిగకు వెళ్లి విచారణ చేశారు. మొదట నకిలీ పత్రాలు సృష్టించిన సర్వే నెంబర్లలోని భూములను పరిశీలించారు. సర్వే నెంబర్ 2300లోని 37.80 ఎకరాలను 2010 ఏప్రిల్ నెలలోనే ప్రభుత్వం ఏపీఐఐసీకి కేటాయించినట్లు నిర్థరించారు. తర్వాత సర్వే నెంబర్ 2198, 2199లో పరిశీలించగా.. 2198లో మొత్తం పట్టాభూమి అని తేల్చారు. అయితే సర్వే నెంబర్ 2199లోని 8.16 ఎకరాలు తిరువూరు దశరథరామిరెడ్డి అనే భూస్వామి సీలింగ్‌కు ఇచ్చేశారని, ఈ భూమిని సీజేఎఫ్‌ఎస్‌గా మార్చి 1976 లోనే గ్రామానికి చెందిన మందల జయరామయ్య, మందల వెంకయ్య, మందల చెంచయ్య, మందల రామయ్యలకు ఇచ్చినట్లు రెవెన్యూ రికార్డుల్లో ఉన్నట్లు అధికారులు పరిశీలించారు. ఈ భూమి అప్పటి నుంచి వీరి స్వాధీనంలో ఉండి, సాగు చేసుకుంటున్నట్లు అధికారులు ధ్రువీకరించారు.
నిందితులపై చర్యలు తీసుకోవాలి
నాలుగు దశాబ్దాల కిందట ప్రభుత్వం తమకు కేటాయించిన పొలం అప్పటి నుంచి తాము సాగు చేసుకుంటున్నామని తమ పొలాలకు నకిలీ పట్టాలు సృష్టించటం అన్యాయమని లబ్ధిదారులు అధికారుల ముందు వాపోయారు. నకిలీ పట్టాలపై అధికారులు కఠినంగా వ్యవహరించి ఎవరు సృష్టించారో తేల్చి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. విచారణ సమయంలో తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. దీంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ విచారణపై జిల్లా అధికారులకు పూర్తిస్థాయి నివేదిక సమర్పిస్తామని తహసీల్దార్ సోమ్లానాయక్ తెలిపారు.
ఆ సంతకాలు మావి కావు
క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలించిన తర్వాత గ్రామంలోని పంచాయతీ కార్యాలయం వద్దకు వెళ్లి విచారణ చేపట్టారు. నకిలీ పత్రాల్లో ఉన్న వారందరూ విచారణకు రావాలని ఆదేశించగా.. వాకా నారయ్య, దుర్గం శ్రీనివాసులు హాజరుకాకపోగా ఏడుగురు హాజరయ్యారు. తహసీల్దార్ సోమ్లానాయక్ హాజరైన ఏడుగురిని విడివిడిగా విచారించారు. వారందరూ తమకు ఆ సర్వే నెంబర్లలో పొలం లేదని, ఆ పత్రాలకు తమకు సంబంధం లేదని, దరఖాస్తులో ఉన్న సంతకాలు కూడా తమవి కావని వివరణ ఇచ్చారు. తమ పేరుతో ఎవరో సంతకాలు చేశారని చెప్పారు. సర్వే నెంబర్ 2199లోని 8.16 ఎకరాలు 1976లో ఎవరి పేరుతో ఇచ్చారో ఆ రైతుల ఆధీనంలోనే ఉందని అధికారులకు వివరించారు.

Reviewed by ADMIN
on
March 08, 2018
Rating:
No comments: