మెట్రో నగరాలకు ధీటుగా నెల్లూరును అభివృద్ది చేస్తా - మేయర్ అబ్దుల్ అజీజ్
The bullet news (Nellore )- మబ్రో నగరాలకు ధీటుగా నెల్లూరును అభివృద్ది చేస్తామని నెల్లూరు నగర మేయర్ అబ్దుల్అజీజ్ అన్నారు.. నిర్వాహణా లోపంతో నగరంలోని పార్కులను ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని ఆయన ఆరోపించారు.. నగరంలో జరుగుతున్న పార్కు ఆధునీకరణ పనులను ఆయన పర్యవేక్షించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి నారాయణ సహకారంతో రూ.65లక్షల నిధులను వెచ్చించి పార్కులో పచ్చదనం, మొక్కల పెంపకం, పాదచారుల మార్గం, మంచినీటి వసతి, బిందు సేద్యం పధ్ధతి ద్వారా మొక్కలకు నీరు, కళాకారుల ప్రదర్శనలూ, ప్రజలు వేడుకలు జరుపుకునేందుకు ప్రత్యేక వేదిక, విద్యుత్ దీపాలు, బల్లలూ, చిన్న పిల్లల ఆటవిడుపు పరికరాలు వంటి వసతులను అధునాతన స్థాయిలో కల్పించామని మేయరు వివరించారు. అదేవిధంగా పార్కుకు విచ్చేసే సందర్శకులు, ముఖ్యంగా యువతలో సేవాతత్పరతను పెంచేలా జాతిపిత మహాత్మా గాంధి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నామని ఆయన వెల్లడించారు. రాబోవు నెల 5వ తేదీ నాటికి పనులన్నింటినీ పూర్తీ చేసి గాంధీ విగ్రహావిష్కరణతో పాటు పార్కును ప్రజలకు అంకితమిస్తామని మేయరు సంకల్పించారు. ఇదేవిధంగా నగరంలోని 25 ప్రధాన పార్కులను యుద్ధ ప్రాతిపదికన పూర్తీ చేసి విచ్చేసే సందర్శకులకు యోగా, వ్యాయామం, ఆట పరికరాలు వంటి మౌళిక వసతులు కల్పిస్తున్నామని వివరించారు.
మెట్రో నగరాలకు ధీటుగా నెల్లూరును అభివృద్ది చేస్తా - మేయర్ అబ్దుల్ అజీజ్
Reviewed by ADMIN
on
March 19, 2018
Rating:
No comments: