షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మీ నిధులు పెంపు - కేసీఆర్
THE BULLET NEWS (HYDERABAD)-కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకం కింద ఆడపిల్ల పెండ్లి కోసం అందించే సహాయాన్ని 75 వేల నూట 16 నుండి ఒక లక్ష నూట 16కు పెంచుతున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. 3 లక్షల 60 వేల లబ్దిదారులకు ఈ పథకం ద్వారా చెక్కులు పంపిణీ చేశామన్నారు. చెక్కుల పంపిణీ సమయంలో లబ్దిదారులు ప్రభుత్వానికి దీవెనలను అందిస్తున్నారని చెప్పారు. కళ్యాణ లక్ష్మీ పథకం వల్ల లబ్దిదారులు వివాహా గుర్తింపు, చట్ట బద్దత సాధిస్తున్నారని కేసీఆర్ తెలిపారు. ఈ పథకానికి 18 సంవత్సరాలు వయోపరిమితిగా నిర్ణయించడం వల్ల బాల్య వివాహాలను నిరోధించడానికి ఉపయోగపడుతున్నాదని అన్నారు.
షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మీ నిధులు పెంపు - కేసీఆర్
Reviewed by ADMIN
on
March 19, 2018
Rating:
No comments: