Top Ad unit 728 × 90

వైసీపీ అంత సాహసం ఎందుకు చేస్తోంది..

The bullet news ( Political) _ ప్రత్యేక హోదా ఇవ్వనందుకు నిరసనగా వైసీపీ మోడీ సర్కార్‌పై ఎర్రజెండా ఎగరవేసింది. అవిశ్వాస తీర్మానానికి అన్ని పార్టీల మద్దతును కూడగట్టేందుకు తీవ్ర ప్రయత్నాలే చేసింది. కానీ.. లోక్‌సభలో స్పష్టమైన మెజార్టీ ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టడం వైసీపీ వల్ల అవుతుందా?. లేక.. అవిశ్వాసం వెనుక జగన్‌కు ప్రత్యేక వ్యూహం ఉందా? చంద్రబాబు ఎత్తుల ముందు అది పనిచేస్తుందా?
ప్రత్యేక హోదా మన హక్కు అంటూ ఆందోళన చేస్తున్న వైసీపీ.. మోడీ సర్కార్‌పై పోరాటం కొనసాగిస్తోంది. లోక్‌సభలో మరోసారి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి సిద్ధమైంది. వైసీపీ ఎంపీలు అవిశ్వాసానికి మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే పలువురు పార్టీల ఫ్లోర్ లీడర్లను కలిసి జగన్ రాసిన లేఖలను వారికి అందజేశారు. 100 మంది ఎంపీలు తాము పెట్టే అవిశ్వాసానికి మద్దతిస్తారని.. కాంగ్రెస్, వామపక్షాలు, శివసేన సహా మరికొన్ని పార్టీలు తమతో కలిసి వస్తాయని చెప్తున్నారు. సభలో ఉన్న బలాబలాలు చూస్తే తీర్మానం నెగ్గే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదు. అయినా వైసీపీ ఇంతటి సాహసాన్ని ఎందుకు చేస్తోంది అంటే.. దీనికి వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి చెబుతున్న సమాధానం ఒక్కటే. రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయాన్ని సభలో ఎత్తి చూపడమే.. తమ లక్ష్యమంటున్నారు జగన్‌. అయితే.. లోక్‌సభ జరుగుతుందో లేక.. నిరవధికంగా వాయిదా పడుతుందో తెలియని పరిస్థితుల్లో.. వైసీపీ అవిశ్వాస తీర్మానం ఎంతవరకూ చర్చకు వస్తుందన్నదీ అనుమానమే.
లోక్‌సభలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టడం ద్వారా వైసీపీ ప్రధానంగా ఆశిస్తున్న లక్ష్యాలు మాత్రం ప్రధానంగా మూడు కనిపిస్తున్నాయి. ఒకటి బీజేపీ- టీడీపీ బంధాన్ని విచ్ఛిన్నం చేయడం.. రెండు - ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో టీడీపీని దోషిగా నిలబెట్టడం.. మూడు - రాష్ట్ర ప్రయోజనాల కోసం తామే పోరాడుతున్నామన్న మైలేజ్‌ను దక్కించుకోవడం. వైసీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెడతామనే సమయానికి టీడీపీ-బీజేపీ మధ్య పొత్తు బలంగానే ఉంది. కానీ.. టీడీపీ మంత్రులు రాజీనామాలు చేయడంతో బంధానికి బీటలు వారాయి. ఆ తర్వాత చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి.. కేంద్రంపై వ్యూహాత్మకంగా అవిశ్వాసం ప్రకటించారు. దీంతో.. టీడీపీని ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలన్న వైసీపీ ప్రయత్నం మాత్రం అంతగా నెరవేరకపోవచ్చు. ఓ రకంగా హస్తినలో సాగుతున్న పోరాటంలో వైసీపీ కంటే.. టీడీపీలో ఓ అడుగు ముందుంది. జాతీయస్థాయిలో చంద్రబాబుకి ఉన్న సంబంధాలతో.. టీడీపీ అవిశ్వాస తీర్మానానికి వెల్లువెలా మద్దతు వచ్చింది. దీంతో కేంద్రంపై పోరులో.. వైసీపీ కాస్త వెనకపడ్డట్లే కనిపిస్తోంది.
మరోవైపు వైసీపీకి ప్రజల్లో మైలేజ్ కూడా ఎంతవరకూ దక్కుతుందన్నదీ డౌటే. ఎందుకంటే, ఈ విషయంలో టీడీపీ, వైసీపీల పోరాటాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్న ఓటర్లు .. రెండు వైపులా చీలిపోయే ప్రమాదం ఉంది. పైగా, ఇప్పటికే బీజేపీకి దగ్గర కావడానికి వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోందన్న విమర్శలున్నాయి. ఇప్పుడు అవిశ్వాసం పెట్టినా, ఎన్నికల సమయానికి రెండు పార్టీలూ పొత్తుకు సిద్ధమైనా ఆశ్చర్యపడక్కర్లేదన్న టాక్‌ కూడా నడుస్తోంది. ఒకవేళ అదే జరిగితే మాత్రం, అది పూర్తిగా వైసీపీకి మైనస్‌గా మారుతుందనే అంటున్నారు. కేంద్రంపై అవిశ్వాసం పెట్టామని చెప్పుకోవడానికి కూడా అప్పుడు వైసీపీకి ఛాన్స్ ఉండకపోవచ్చు.
వైసీపీ అంత సాహసం ఎందుకు చేస్తోంది.. Reviewed by ADMIN on March 19, 2018 Rating: 5

No comments:

All Rights Reserved by nagendra © 2014 - 2015
Powered By Blogger, Share by Star Tuan

Biểu mẫu liên hệ

Name

Email *

Message *

Powered by Blogger.