స్టీఫెన్ హాకింగ్‌కు రెండు పెళ్లిళ్ళు
The bullet news (National)_ ఖగోళ శాస్త్రంలో ఎన్నో అద్భుత ఆవిష్కరణలు చేసిన స్టీఫెన్ హాకింగ్ చిన్న వయసులోనే నరాల వ్యాధి కారణంగా శరీరం కదిలించలేకపోయినా ఎన్నో అద్భుతాలు సృష్టించారు. అలాగే ఆయన నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు అందర్నీ ఆశ్చర్యపరిచాయి. హాకింగ్ చిన్న వయస్సులోనే రెండుసార్లు పెళ్లి చేసుకున్నారు. గ్రాడ్యుయేట్ స్టూడెంట్‌గా ఉన్న సమయంలోనే జేన్ విల్డేతో అయన వివాహం జరిగింది. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య వచ్చిన మనస్పర్థల కారణంగా 1995లో ఈ ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. తర్వాత తనకు నర్సుగా సేవలు అందించిన ఎలైనీ మాసన్‌ను హాకింగ్ పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం హాకింగ్‌కు ముగ్గురు పిల్లలు, ముగ్గురు మనువళ్ళు ఉన్నారు.
స్టీఫెన్ హాకింగ్‌కు రెండు పెళ్లిళ్ళు
Reviewed by ADMIN
on
March 14, 2018
Rating:
No comments: