నవంబర్ 11 న చేపట్టిన "ఛలో కేరళ" ను విజయవంతం చెయ్యండి -వాల్ పోస్టర్ ఆవిష్కరణలో మనోజ్
The Bullet News ( Gudur )_ కేరళ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, విద్యార్థి, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా నవంబర్ 11న 'ఛలో కేరళ' కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు గూడూరు డివిజన్ ఎబివిపి కార్యదర్శి మనోజ్ తెలిపారు.. ఈ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్ ని స్థానిక స్వర్ణాంధ్ర భారతి కళాశాలలో ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా మనోజ్ మాట్లాడుతూ జాతీయ భావనకు, ప్రజాస్వామ్య విలువలకు విఘాతం కలిగిస్తున్న కేరళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరూ గళం విప్పాలన్నారు.. కేరళలో
కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చిన తర్వాత 21 రాజకీయ హత్యలు, 4,399 నార్కోటిక్ డ్రగ్ కేసులతో పాటు 1100 అత్యాచార కేసులు నమోదయ్యాయని ఆరోపించారు..దళితులపై కూడా దాడులు జరిగాయన్నారు.. దాంతో దేశ భక్తి ని చాటే పాటు ఎబివిపి నాయకులను చంపుతున్నారని మండిపడ్డారు.. ఆ హత్యాకాండకు నిరసనగా నవంబర్ 11న ఛలో కేరళ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మనోజ్ తెలిపారు.. ఈ నిరసన కార్యక్రమానికి ప్రతి ఒక్క భారతీయుడు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు.. ఈ కార్యక్రమంలో ఎబివిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లికార్జున, నగర అధ్యక్షుడు దొరబాబు, డివిజన్ సహాయ కార్యదర్శి రవి, హేమంత్, మహేంద్ర, అహ్మద్, వెంకయ్య పాల్గొన్నారు..
కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చిన తర్వాత 21 రాజకీయ హత్యలు, 4,399 నార్కోటిక్ డ్రగ్ కేసులతో పాటు 1100 అత్యాచార కేసులు నమోదయ్యాయని ఆరోపించారు..దళితులపై కూడా దాడులు జరిగాయన్నారు.. దాంతో దేశ భక్తి ని చాటే పాటు ఎబివిపి నాయకులను చంపుతున్నారని మండిపడ్డారు.. ఆ హత్యాకాండకు నిరసనగా నవంబర్ 11న ఛలో కేరళ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మనోజ్ తెలిపారు.. ఈ నిరసన కార్యక్రమానికి ప్రతి ఒక్క భారతీయుడు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు.. ఈ కార్యక్రమంలో ఎబివిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లికార్జున, నగర అధ్యక్షుడు దొరబాబు, డివిజన్ సహాయ కార్యదర్శి రవి, హేమంత్, మహేంద్ర, అహ్మద్, వెంకయ్య పాల్గొన్నారు..
నవంబర్ 11 న చేపట్టిన "ఛలో కేరళ" ను విజయవంతం చెయ్యండి -వాల్ పోస్టర్ ఆవిష్కరణలో మనోజ్
Reviewed by ADMIN
on
October 25, 2017
Rating:
No comments: