చంద్రన్న భీమా చెక్కును అందజేసిన మునిసిపల్ చైర్ పర్సన్ దొంతు శారదా
THE BULLET NEWS (VENKATAGIRI)-వెంకటగిరి పట్టణం ధర్మపురంలోని 14వ వార్డు లో అనారోగ్య కారణాలతో గోనుగోడుగు వెంకటమ్మ (57) మరణించారు.. విషయం తెలుసుకున్న మునిసిపల్ చైర్ పర్సన్ దొంతు శారదా మృతురాలి ఇంటికి వెళ్లి ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చారు. చంద్రన్న బీమా ఐదువేల రూపాయల చెక్కును కుటుంబసభ్యులకు అందజేశారు.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంటికి పెద్ద దిక్కును కోల్పోవడం చాలా బాధాకరమన్నారు.. ఇలాంటి సమయాల్లో చంద్రన్న భీమా ఉపయోగపడుతుందని ఆమె వెల్లడించారు..ఈ కార్యక్రమంలో ఆ ప్రాంత ప్రజలందరు పాల్గొన్నారు.
చంద్రన్న భీమా చెక్కును అందజేసిన మునిసిపల్ చైర్ పర్సన్ దొంతు శారదా
Reviewed by ADMIN
on
October 25, 2017
Rating:
No comments: