అంతర్జాతీయ యోగా పోటీలకు ఎంపికైన వీపీఆర్ విద్య విద్యార్దిని మద్దాలి దేవకి - అభినందించిన వి.పి.ఆర్ ఫౌండేషన్ అధినేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
The bullet news (Nellore)- ప్రముఖ పారిశ్రామిక వేత్త వి.పి.ఆర్ స్థాపించిన వి.పి.ఆర్ విద్య ఉన్నత పాఠశాలలోని విద్యార్దులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తున్నారు.. ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిర్వహించిన 63 వ అంతర జిల్లా యోగా పోటీలలో అండర్ 14 విభాగంలో విపీఆర్ చదువుతున్న మద్దాలి దేవకి ప్రధమ స్థానాన్ని కైవసం చేసుకుంది.. దీంతో చత్తీస్ ఘడ్ లో వచ్చే నెల జరగనున్న జాతీయ స్థాయి పోటీటకు అర్హత సాధించింది.. దీంతో వి.పి.ఆర్ ఫౌండేషన్ అధినేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , ఆయన సతీమణి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి విద్యార్దిని మద్దాలి దేవకినీ అభినందించారు.. చదువుతో పాటు క్రీడల్లో కూడా తమ విద్యార్దులు అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తుండటం తమకు చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రపంచం దేశాలు మన యోగాను అభ్యసిస్తున్నాయి అంతటి గుర్తింపు తెచ్చిన యోగాలో తమ విద్యార్దిని పాల్గొని బహుమతి గెలిచినందుకు గర్వపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వి.పి.ఆర్ ఫౌండేషన్ సిఈఓ ఆచార్య నారాయణ రెడ్డి , వి.పి.ఆర్ విద్యా ప్రిన్సిపాల్ శ్రీనివాస్, కేతంరెడ్డి వినోదరెడ్డి తదితరులు పాల్గొన్నారు..
అంతర్జాతీయ యోగా పోటీలకు ఎంపికైన వీపీఆర్ విద్య విద్యార్దిని మద్దాలి దేవకి - అభినందించిన వి.పి.ఆర్ ఫౌండేషన్
అధినేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
Reviewed by ADMIN
on
October 28, 2017
Rating:
No comments: