సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి - యుటిఎఫ్ రాష్ట ప్రధాన కార్యదర్శి బాబురెడ్డి
The bullet news (Nellore)-రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో సీపీఎస్ విధానం రద్దు గురించి చర్చించి రద్దు చేసేందుకు చర్యలు తీసుకోవాలని యుటిఎఫ్ రాష్ట ప్రధాన కార్యదర్శి బాబు రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఎస్ విధానానికి నిరసగా నవంబర్ 3,4 తేదీల్లో ప్యాప్టో ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్లు ఆయన వెల్లడించారు. నెల్లూరులోని ఓ సమావేశంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు.. పెన్షన్ ఉద్యోగుల హక్కు అని సుప్రీం కోర్టు తీర్పునిచ్చిందని దాన్ని మన పాలకులు పెడచెవిన పెట్టి నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.. బ్రిటిష్ వారు సైతం పెన్షన్ విధానం అమలు చేస్తే మన ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. దాదాపు 1,84,000 మంది ఉపాధ్యాయులు పెన్షన్ కోల్పోయారని రాష్ట ప్రభుత్వం పిఎప్ఆర్డీఏతో ఒప్పదం రద్దు చేసుకుని పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సిపిఎస్ విధానాన్ని రద్దు కోరుతూ నవంబర్ 3,4 తేదీల్లో ప్యాప్టో ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.. కార్పోరేట్ విద్యా విధానం వల్ల విద్యార్దులు మానసకి ఒత్తిడికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని దీనిపై ప్రభుత్వం ఓ కమిటీ వేయాలని ఆయన డిమాండ్ చేశారు. నీరజా కమిటీ రిపోర్ట్, చక్రపాణి కమిషన్ రిపోర్టు లను వెంటనే అమలు చేయాలన్నారు.. విద్యార్దులు, వారి తల్లిదండ్రులు, మేధావులతో కూడిన కమిటీ వేస్తే ప్రయోజనకరంగా ఉంటుంది తప్ప కార్పోరేట్ అధిపతులతో కమిటీ వేస్తే ఏం ప్రయోజనం ఉంటుందని ఆయన ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో యుటిఎప్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తులసీరాంబాబు, నవకోటేశ్వర్ రావు, సీనియర్ నాయకులు చంద్రశేఖర్, హజరత్తయ్య తదితరులు పాల్గొన్నారు..
సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి - యుటిఎఫ్ రాష్ట ప్రధాన కార్యదర్శి బాబురెడ్డి
Reviewed by ADMIN
on
October 28, 2017
Rating:
No comments: