పుట్టలో పాలు.. ప్రత్యక్షమైన పాము
THE BULLET NEWS (EAST GODAVARI)-నాగుల చవితి సందర్భంగా పుట్టలో పాలు పోసేందుకు వెళ్లిన భక్తులకు ఊహించని షాక్ తగిలింది. ఒక్కసారిగా పాము ప్రత్యక్షం కావడంతో భక్తులు అక్కడ నుంచి పరుగులు తీసిన ఘటన తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో సోమవారం చోటుచేసుకుంది. సోమవారం నాగులచవితి పర్వదినం సందర్భంగా మహిళలు... పుట్టలో పాలు పోసేందుకు వచ్చారు. పూజల చేసిన అనంతరం పుట్టలో పాలు పోయడంతో ఒక్కసారిగా పాము బయటకు వచ్చింది. దీంతో బిత్తరపోయిన మహిళలు భయంతో అక్కడ నుంచి పరుగులు తీశారు.
పుట్టలో పాలు.. ప్రత్యక్షమైన పాము
Reviewed by ADMIN
on
October 23, 2017
Rating:
No comments: