గూడూరు పట్టణాభివృద్దికి కృషి- మున్సిపల్ చైర్ పర్సన్ పొనకా దేవసేనమ్మ
The bullet news (Gudur)- గూడూరు పట్టణాభివృద్దికి అహర్నిశలు కృషి చేస్తున్నట్లు మున్సిపల్ చైర్ పర్సన్ పొనకా దేవసేనమ్మ తెలిపారు..స్థానిక 26 వ వార్డు లో సీసీ కల్వర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు..అనంతరం వార్డులో పర్యటించారు.. ఇంటింటికి వెళ్లి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు..ఈ సందర్భంగా ఆమె దృష్టికి వచ్చిన పలు సమస్యలను అక్కడిక్కడే పరిష్కరించారు..అదే వార్డులో ఉన్న స్కూలు, పార్కులను ఆమె సందర్శించారు.. దోమల మందు పిచికారి చేయించారు.. అనంతరం చైర్ పర్సన్ మాట్లాడుతూ గూడూరు పట్టణాన్ని అభివృద్ది చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నానన్నారు.. ఈ కార్యక్రమంలో వైస్ చేర్మెన్ శీలం కిరణ్ కుమార్, డీఈ శ్రీనివాసులు, 24వవార్డు కౌన్సిలర్ ముప్పాళ్ళ లక్ష్మీ, బాలిబోయిన రమేష్ , తదితరులు పాల్గొన్నారు..
గూడూరు పట్టణాభివృద్దికి కృషి- మున్సిపల్ చైర్ పర్సన్ పొనకా దేవసేనమ్మ
Reviewed by ADMIN
on
October 27, 2017
Rating:
No comments: