చీరలు దొంగలించబోయారు.. చితక్కొట్టారు..
THE BULLET NEWS (BUCHI) -నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో పట్ట పగలు ఓ బట్టల దుకాణంలో చోరీకీ ప్రయత్నించిన ఇద్దరు మహిళా దొంగలను పట్టుకుని దేహశుద్ది చేశారు దుకాణాదారులు. బట్టలు కొనుకొనేందుకు వచ్చినట్టుగా నటిస్తు దాదాపు ఇరవై వేల రూపాయలు విలువ చేసే బట్టలను అపహరించేందుకు ప్రయత్నించారు. ఇద్దరు మగవాళ్ళు ఇద్దరు మహిళలు షాపులోకి రాగా వారిలో మహిళలు మాత్రమే పట్టుబడ్డారు. మగ దొంగలు మాత్రం తప్పించుకొని పారిపోయారు. పట్టుబడిన మహిళా దొంగలకు దేహశుద్ది చేసి షాపు యాజమాన్యం పోలీసులకు అప్పగించారు.
చీరలు దొంగలించబోయారు.. చితక్కొట్టారు..
Reviewed by ADMIN
on
October 28, 2017
Rating:
No comments: