కమిషనర్ గారూ.. విద్వేషాలు రెచ్చగొట్టొద్దు - బిజేపీ నేత మిడతల రమేష్
THE BULLET NEWS (NELLORE)-నెల్లూరు మునిసిపల్ కమిషనర్ ఢిల్లీరావు హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని బిజేపీ ఆరోపించింది.. నెల్లూరు బిజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో బిజేపి సీనియర్ నాయకులు మిడతల రమేష్ కమిషనర్ ఢిల్లీరావు తీరుపై మండిపడ్డారు.. మతవిద్వేషాలు రెచ్చగొట్టేందుకు కమిషనర్ యత్నిస్తున్నారని ఆరోపించారు.. నెల్లూరులోని రాగిచెట్టు సెంటర్ లో బిజేపీ- విహేచ్ పి కార్యకర్తలు నిర్మించుకున్న శ్రీరామ స్థూపాన్ని ధ్వంసం చేయడాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. 1993లో అయోధ్య కరపేవలో పాల్గొన్న కార్యకర్తలు శ్రీరాముని స్మతుల కోసం రాగి చెట్టు సెంటర్ లో స్థూపం నిర్మించారని, రోడ్డు విస్తరణకు సైతం ఎలాంటి అరోధం లేకుండా ఉన్న శ్రీరామ స్థూపాన్ని కమిషనర్ ఆదేశాలతో తొలగించారన్నారు.. హిందువుల మనోభావాలను దెబ్బతీసిన కమిషనర్ పై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఎవరెన్ని అడ్డంకులు స్రుష్టించినా శ్రీరామ స్థూపాన్ని తిరిగి నిర్మించి తీరుతామని ఆయన వెల్లడించారు.
కమిషనర్ గారూ.. విద్వేషాలు రెచ్చగొట్టొద్దు - బిజేపీ నేత మిడతల రమేష్
Reviewed by ADMIN
on
October 28, 2017
Rating:
No comments: