అది పాదయాత్ర కాదు.. పాప పరిహారపు యాత్ర - మంత్రి జవహార్ సెటైర్లు
The bullet news (Amaravathi)- వైసీపీ తీరు చూస్తుంటే 2019 ఎన్నికల లోపే ప్రజలు ఆ పార్టీని భూస్థాపితం చేసేలా ఉన్నారని రాష్ట ఎక్సైజ్ శాఖామంత్రి జవహర్ అన్నారు.. ఆయన విడుదల చేసిన పత్రికా ప్రకటనలో వైసీపీ తీరుపై, వారు అనుసరిస్తున్న విధానాలపై మండిపడ్డారు.. రానున్న ఎన్నికల్లో వైకాపా పోటీ చేసే అవకాశాన్ని కొల్పోవడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.. ప్రతిపక్ష హోదాలో ఉండి ప్రజల సమస్యలపై పోరాటం చేయకుండా అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తామని వైసీపీ నాయకులు అనడం విడ్డురంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నూరు శాతం ప్రజలలోకి వెళ్ళడం తో అసెంబ్లీ సమావేశాల్లో ఏం చర్చించాలో తెలియకే అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని వారు నిర్ణయించుకున్నట్లు ఆయన విమర్శించారు. ఇదే సమయంలో జగన్ తలపెట్టిన పాదయాత్రపైనా సెటైర్లు వేశారు. .రాష్ట్రంలో విపక్ష నేతగా ఫలమవ్వటంతో తన కేసుల నుండి తప్పించుకోనేoదుకు జగన్ పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు ఆయన ఆరోపించారు.. రాజకీయ లబ్ది కోసమే జగన్ పాదయాత్రను వాడుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర అభివృధ్ధిని చూసి జగన్ ఓర్వలేకే జగన్ పాప పరిహారపు పాదయాత్ర మెదలు పెడుతున్నారన్నారని ఎద్దేవా చేశారు.
అది పాదయాత్ర కాదు.. పాప పరిహారపు యాత్ర - మంత్రి జవహార్ సెటైర్లు
Reviewed by ADMIN
on
October 26, 2017
Rating:
No comments: