జోరు వానలోను అలుపెరగని సేవకుడు..
The Bullet News ( Nellore )-
ప్రజల సూచనలు, సలహాలు, వారు చూపించే ఆప్యాయతతో 105 రోజుల ప్రజాబాట కార్యక్రమాన్ని రెట్టింపు ఉత్సాహంతో కొనసాగిస్తానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు..మన ఎమ్మెల్యే- మన ఇంటికి కార్యక్రమంలో భాగంగా 33వ రోజైన ఇవాళ సత్యంజి నగర్ లో పర్యటించారు.. జోరు వానలోను ఇంటింటికి వెళ్లి వారిని ఆప్యాయంగా పలకరించారు.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.. తాము అభిమానించే ఎమ్మెల్యే ఇంటికి రావటంతో సత్యంజి నగర్ వాసులు ఆనందం వ్యక్తం చేశారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటం రెడ్డి మాట్లాడుతూ తన నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రతి గడప తొక్కి, ప్రతి ఒక్కరిని పలకరించి,సమస్యల పరిష్కారమే ధ్యేయంగా తలపెట్టిన ఈ కార్యక్రమం ప్రజల సహకారంతో విజయవంతంగా కొనసాగుతుందన్నారు.. ఇప్పటి వరకు రూరల్ మండల పరిధిలోని 21 గ్రామాల్లో పర్యటించి, 14000 కుటుంబాలను నేరుగా కలుసుకున్నన్నారు. ప్రజలు ఇచ్చిన సద్విమర్శలను సైతం ఆహ్వానించానని ఆయన వెల్లడించారు..

Reviewed by ADMIN
on
November 01, 2017
Rating:
No comments: