గుట్కాఅక్రమార్కులపై సీసీఎస్ పోలీసులు ఉక్కుపాదం - 8 మంది అరెస్టు
The bullet news (Nellore )-గుట్కా అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతున్నారు నెల్లూరు సిసిఎస్ పోలీసులు.. పక్కా సమాచారంతో వరుసదాడులు చేస్తూ గుట్కా వ్యాపారులను, సప్లయర్స్ ను బెంబెలెత్తిస్తున్నారు.. నెల్లూరు నగరంలోని వన్ టౌన్, టు టౌన్, త్రి టౌన్ పరిధిలోని గుట్కా స్థావరాలపై ఇవాళ దాడులు చేసిన పోలీసులు 8 మంది గుట్కా వ్యాపారులను, సప్లయర్స్ ను అరెస్టు చేశారు.. వారి వద్ద నుంచి సుమారు 5 లక్షలు విలువ చేసే గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను డిఎస్పీ బాలసుందర్ రావు మీడియాకు వివరించారు.
నెల్లూరు పట్టణంలోని రెండో, మూడో, నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నిషేదిత గుట్కాలను విక్రయిస్తున్న, వారికి సప్లయ్ చేస్తున్న 8 మందిని అరెస్టు చేశామన్నారు.. రెండో పట్టణ పరిధిలో నవాబ్ పేటకు చెందిన కిషోర్ కుమార్ సుధాకర్ రెడ్డి, నరుకూరు రోడ్డుకు చెందిన మల్లికార్జున లను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 265 గుట్కా ప్యాకెట్ల స్వాధీనం చేసుకున్నామన్నారు.. అలాగే మూడో, నాల్గో పట్టణ పరిధిలోని హరనాథపురం, తదితర ప్రాంతాల్లో రాజశేఖర్, మోహన్ వెంకట శేషాద్రి, చందా వెంటక రాజశేఖర్ , సుధాకర్ రెడ్డి లను అరెస్టు చేశామన్నారు.. మొత్తం 5లక్షలు విలువ చేసే గుట్కా ప్యాకెట్లును స్వాధీనం చేసుకున్నామన్నారు.. నిషేదిత గుట్కా లను విక్రయించినా, సప్లయ్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.. వీరిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన వారికి డిఎస్పీ రివార్డులు ప్రకటించారు.. ఈ సమావేశంలో సిఐలు సైదా, చెంచు రామరావు, కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.

Reviewed by ADMIN
on
November 01, 2017
Rating:
No comments: