Top Ad unit 728 × 90

సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలి - పీడీఎఫ్ ఎమ్మెల్సీ

THE BULLET NEWS (NELLORE)-కార్పోరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వ పెద్దలు కుట్రలు చేస్తున్నారని పీడీఎప్ ఎమ్మెల్సీ శ్రీనివాసుల రెడ్డి ఆరోపించారు.. నెల్లూరులోని కస్తూరి భా కళాక్షేత్రంలో యుటిఎప్ మహాసభలు జరిగాయి.. ఈ సందర్భంగా నగరంలో ఉపాధ్యాయులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీనుద్దేశించి ఎమ్మెల్సీ శ్రీనివాసులు మాట్లాడుతూ విద్యా వ్యవస్థలొ మార్పులు తీసుకురావడం చేతగాక ప్రభుత్వం ఉపాధ్యాయులపై తప్పులెంచడం సరైన పద్దతికాదన్నారు.. సీపీఎస్ రద్దుకు ప్రభుత్వం ముందుకు రావాలని డిమాండ్ చేశారు.. విద్యారంగంలో కొత్త కొత్త విధానాలు ప్రవేశపెట్టాలన్నారు.. అలాగే వేల సంఖ్యలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్న బోజన పథకం స్వచ్చంద సంస్థలకు అప్పగించడం సరైన పద్దతికాదన్నారు.. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని ప్రభుత్వం అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.. మహాసభల్లో చర్చించి తీర్మాన చేసిన వాటిని శాసనమండలిలో ప్రవేశపెట్టి చర్చిస్తామన్నారు..
సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలి - పీడీఎఫ్ ఎమ్మెల్సీ Reviewed by ADMIN on November 19, 2017 Rating: 5

No comments:

All Rights Reserved by nagendra © 2014 - 2015
Powered By Blogger, Share by Star Tuan

Biểu mẫu liên hệ

Name

Email *

Message *

Powered by Blogger.