"పిచ్చి" పై పేలుతున్న మాటల తూటాలు...
The Bullet News ( Nellore ) - పిచ్చి సర్టిఫికేట్ తో కేసుల నుంచి బయటపడిన బాలక్రుష్ణకు వైసీపీని, జగన్మోహన్ రెడ్డిని విమర్శించేస్థాయి లేదంటూ నెల్లూరు సిటి ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ చేసిన కామెంట్స్ పై నుడా చైర్మన్ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి రివర్స్ పంచ్ వేశారు.. సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవే టార్గెట్ గా విరుచుకుపడ్డారు.. బాలక్రుష్ణకు, జగన్మోహన్ రెడ్డికి మధ్య నక్కకు నాగలోకానికి తేడా ఉందన్నారు.. జగన్మోహన్ రెడ్డికి ఎవ్వరూ భరించలేనంత పిచ్చుందని అందుకే 25 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ పార్టీలో చేరారన్నారు.. పార్టీ మారిన ఎమ్మెల్యేలందరినీ అడితే జగన్ ఓ శాడిస్ట్ అని చెబుతున్నారని ఆయన విమర్శించారు.. బసవతారకం క్యాన్సర్ హాస్పటల్ ద్వారా ఎంతోమందికి ప్రాణదానం చేసిన బాలక్రుష్ణను విమర్శించే స్థాయి అనిల్ కుమార్ యాదవ్కు లేదంటూ దుయ్యబట్టారు.. పిచ్చిపట్టినట్లు రోడ్లమీద తిరుగుతూ నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమంటూ ఆయన అనిల్ కుమార్ యాదవ్ ను ఆయన హెచ్చరించారు.. నీ స్థాయింటో తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు..కొండలాంటి టిడిపిని ఢీ కొంటె భూస్థాపితం అవ్వటం ఖాయమన్నారు...
"పిచ్చి" పై పేలుతున్న మాటల తూటాలు...
Reviewed by ADMIN
on
November 12, 2017
Rating:
No comments: