గాంధీ ఆశ్రమం నెల్లూరుజిల్లాలో ఉండటం తెలుగు రాష్టాలకే గర్వకారణం - డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ద ప్రసాద్
THE BULLET NEWS (INDHUKURPET)-గాంధీ ఆశయాలు ప్రపంచానికే ఆదర్శమని డిప్యూటీ స్పీకర్ మండలి బుద్దప్రసాద్ అన్నారు.. నెల్లూరుజిల్లా పల్లిపాడులో ఉన్న గాంధీ ఆశ్రమాన్ని గజల్ శ్రీనివాసులతో ఆయన సందర్శించారు.. స్వాతంత్య సమరంలో మహాత్మాగాంధీ ఫోటో ఎగ్జిబిషన్ ను ఆయన తిలకించి మీడియాతో మాట్లాడారు.. స్వాతంత్ర్య సమరంలో తెలుగువారి తెగువ మరపురానిదన్నారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నా .. స్వాతంత్ర్య సమరంలో ఉప్పు సత్యాగ్రహం, సైమన్ కమిషన్ లాంటి బ్రిటీష్ వ్యతిరేఖ ఉద్యమాలకు నాయకత్వం వహించింది తెలుగువారేనన్నారు..ఇది తెలుగువారి తెగువకు ,పోరాటానికి నిదర్శనమన్నారు.స్వాతంత్ర్య సమరంలో సబర్మతి తర్వాత అంతటి శాంతియుత పోరాటానికి వేదికగా నిలిచిన గాంధీ ఆశ్రమం నెల్లూరులో ఉండడం తెలుగురాష్ట్రాలకే. గర్వకారణమని ఆయన కొనియాడారు..
గాంధీ ఆశ్రమం నెల్లూరుజిల్లాలో ఉండటం తెలుగు రాష్టాలకే గర్వకారణం - డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ద
ప్రసాద్
Reviewed by ADMIN
on
November 05, 2017
Rating:
No comments: