వేదపండితులను ఘనంగా సన్మానించిన విపీఆర్ దంపతులు
The bullet news (Nellore)- నెల్లూరులో మూడు రోజులపాటు వైభవంగా జరిగిన లక్ష దీపోత్సవం కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన రిత్వికులను, వేదపండితులను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు ఘనంగా సన్మానించారు.. ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ కార్తీకమాసం ఎంతో పవిత్రమైనదన్నారు.. మహా నగరాలకే పరిమితమైన ఈ దీపోత్సవ కార్యక్రమాన్ని నెల్లూరు నగర ప్రజలకు తమ అధ్యక్షతన నిర్వహించే భాగ్యం కలిగినందుకు తాము అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఈ లక్ష దీపోత్సవం విజయవంతం కావడంలో తమతో పాటు కృషి చేసిన రుత్వికులు , వేద పండితులకు , కమిటీ సభ్యులకు వారు ధన్యవాదములు తెలిపారు.. కార్యక్రమంలో కేతంరెడ్డి వినోద్ రెడ్డి, భాస్కర్ శర్మ , విశ్వనాధ్ , సంపత్ రాజు , ప్రభాకర్ రావు పాల్గొన్నారు.
వేదపండితులను ఘనంగా సన్మానించిన విపీఆర్ దంపతులు
Reviewed by ADMIN
on
November 05, 2017
Rating:
No comments: