రాష్ట ప్రజల కష్టాలను నేరుగా తెలుసుకోవడానికే పాదయాత్ర...
The bullet news (Nellore)_ జగన్మోహన్ రెడ్డి తీసుకునే నిర్ణయాలు, ఆయన చేసే ఆలోచనలన్నింటిలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రతిబింబిస్తారని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్ రెడ్డి అన్నారు.. రాష్ట ప్రజలు వైఎస్ ప్రతిరూపాన్ని జగన్ లో చూసుకుంటున్నారన్నారు.. రేపటి నుంచి చేపట్టబోతున్న మహా సంకల్ప యాత్ర విజయవంతం కావాలని కోరుతూ తిరుపతి ఎంపీ వరప్రసాద్ తో కలిసి గొలగమూడి వెంకయ్య స్వామి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు పడుతున్న కష్టాలను నేరుగా తెలుసుకోవడానికే జగన్మోహన్ రెడ్డి మహా సంకల్ప యాత్ర చేపడుతున్నారన్నారు..జగన్ పాదయాత్ర అనౌన్స్ చేసినప్పటి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా తెలుగుదేశం నాయకులందరికీ వెన్నులో వణుకు పుడుతోందన్నారు.. రాష్ట ప్రజలు రాజశేఖర్ రెడ్డి ప్రతిరూపాన్ని జగన్ లో చూస్తున్నారని, పాదయాత్ర కచ్చితంగా విజయవంతం అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.. జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించేందుకు రాష్ట ప్రజలు సిద్దంగా ఉన్నారన్నారు..
రాష్ట ప్రజల కష్టాలను నేరుగా తెలుసుకోవడానికే పాదయాత్ర...
Reviewed by ADMIN
on
November 05, 2017
Rating:
No comments: