"టాస్క్" కు భారీగా చిక్కుతున్న ఎర్రదొంగలు..
The bullet news (Nellore)- ఎర్రదొంగల కదలికలపై అనుక్షణం నిఘా.. నిరంతరం కూంబింగ్.. అనుమానం వస్తే దాడులు.. స్మగర్లు ఎదురుతిరిగినా ఎదురొడ్డి నిలబడుతూ అసాంఘీక కార్యకలాపాలు, ఎర్రచందనం, గుట్కా మాఫియాల నియంత్రణే లక్ష్యంగా ఎస్పీ పిహెచ్ డీ రామక్రుష్ణ ఏర్పాటు చేసిన టాస్క్ పోర్స్ టీమ్ సత్ఫలితాలనిస్తోంది.. ఓఎస్డీ విఠలేశ్వర్ రావు ఆద్వర్యంలో ఎర్రచందనం పై ఆ టీమ్ ఉక్కుపాదం మోపుతోంది.. పక్కా సమాచారంతో రంగంలోకి దిగుతున్న టాస్క్ ఫోర్స్ టీమ్ ఎక్కడిక్కడ ఎర్రదొంగల భరతం పడుతోంది.. ఇవాళ జిల్లాలోని సీతారామపురం, డక్కిలి, కలువాయి పోలీస్ స్టేషన్ల పరిధిలో ఏకకాలంలో దాడులు నిర్వహించి ఇద్దరు తమిళ కూలీలతో సహా 19 మంది అంతరాష్ట, స్తానిక స్మగర్లను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 80లక్షల విలువ చేసే 60 దుంగలతో పాటు మూడు వాహనాలు, ఆరు సెల్ ఫోన్లు, 12గొడ్డళ్లు సీజ్ చేశారు.. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఓఎస్డీ విఠలేశ్వర్ రావు మీడియాకు వివరించారు..
తమిళనాడు రాష్టానికి చెందిన ఇద్దరు స్మగ్లర్లు ప్రకాశం జిల్లా, నెల్లూరుజిల్లాలోని వెలిగొండ ప్రాంతానికి చెందిన స్థానిక స్మగర్లు వద్ద ఎర్రచందనం దుంగలను కొనుగోలు చేసి చెన్నయ్ కు తరలిస్తున్నారు.. అక్కడి నుంచి కంటైనర్లు ద్వారా విదేశాలకు విక్రయాలు జరుపుతుంటారు.. ఈ మూడు ప్రాంతాల్లోని స్మగ్లర్లను పట్టుకునేందుకు పోలీసులు యత్నించడంతో పలువరు స్మగ్లర్లు పోలీసులపై దాడులకు దిగారు.. మరికొన్ని చోట్ల పోలీస్ వాహనాలను గుద్దించబోయారు.. దీంతో ప్రత్యేక బలగాలతో వారికి పట్టుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉండే స్మగర్లజాబితాను తయారు చేసి వారి ఆస్తులను జప్తు చేసే విధంగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు ఓఎస్డీ విఠలేశ్వర్ తెలిపారు.. ఈ కార్యక్రమంలో ఆయాపరిధిలోని డిఎస్పీలు, ఎస్పీలు పాల్గొన్నారు..

Reviewed by ADMIN
on
November 03, 2017
Rating:
No comments: