ఉపాధ్యాయులకు మా పార్టీ అండగా ఉంటుంది - నెల్లూరు సిటి ఎమ్మెల్యే అనిల్
The bullet news (Nellore)- సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్యాప్టో చేపట్టిన నిరసన దీక్షలకు రాజకీయ నాయకుల మద్దతు పెరుగుతోంది.. నెల్లూరు కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయ సంఘాలు చేస్తున్న దీక్షకు నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మద్దతు ప్రకటించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరైనది కాదన్నారు.. అసెంబ్లీ సమావేశాలను తమ పార్టీ బహిష్కరించిన నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ తో ఈ విషయంపై మాట్లాడతానని ఆయన హామీ ఇచ్చారు.. ఉపాధ్యాయులకు తమ పార్టీ అండగా ఉంటుందన్నారు.. గత రెండు రోజులుగా ఉపాధ్యాయులు రోడ్లమీదకొచ్చి నిరసనలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు..
ఉపాధ్యాయులకు మా పార్టీ అండగా ఉంటుంది - నెల్లూరు సిటి ఎమ్మెల్యే అనిల్
Reviewed by ADMIN
on
November 04, 2017
Rating:
No comments: