సీపీఎస్ అంతం- ఉపాధ్యాయుల పంతం
THE BULLET NEWS (NELLORE)-సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నెల్లూరులోని కలెక్టరేట్ వద్ద ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాలు ధర్నా చేపట్టాయి . ఈ సందర్భంగా యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాబురెడ్డి మాట్లాడుతూ సిపిఎస్ విధానం వల్ల లక్షా ఎనభై నాలుగు వేల కుటుంబాలు వీధిన పడ్డాయని , కనీస పెన్షన్ భద్రత కూడా లేని పరిస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు... ఇప్పటికే అనేక సార్లు సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరిన ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందన్నారు . త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తూ చట్టం తేవాలని, అలాగే త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ప్రతి రాజకీయ పార్టీ సిపిఎస్ పై తమ విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయకపోతే ఈ నెల 20 న చలో అసెంబ్లీ చేపడతామని హెచ్చరించారు .
No comments: