నేను మాటల మంత్రి కాను.. చెప్పిందే చెస్తా - మంత్రి నారాయణ
https://youtu.be/qWSCH9SEHgQ
The bullet news (Nellore)- నేను అందరిలాగా మాటలు చెప్పే మంత్రిని కాను.. చెప్పిందే చేస్తా.. దాని కోసం ఎంతదూరమైనా వెళ్తా... మాటిస్తే మాటమీద నిలబడతానంటూ పురపాలక శాఖామంత్రి పొంగూరు నారాయణ అన్నారు.. నెల్లూరు నగరంలో పర్యటించిన ఆయన స్వచ్చాంధ్ర సాకారం కోసం ప్రతి ఒక్క అధికారి కృషి చేయాలని ఆయన కోరారు.. నెల్లూరులో నగర వీధుల్లో జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ఆయన ఇవాళ ఉదయం నుంచే పరిశీలించారు.. నగరంలో శానిటేషన్ సరిగా లేకపోవడం పట్ల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రాష్ట్రంలో శానిటేషన్ కు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారన్నారు. అధికారులు కూడా అందుకు తోడ్పాటునందించాలన్నారు.. పట్టణంలో 1100 కోట్లతో నిర్మిస్తున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, వాటర్ స్కీమ్ వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసనీ, కానీ మరో ఐదు నెలల పాటు ఈ కష్టాలు భరించక తప్పదన్నారు.. నగరంలోని 13 కాలువలను పూడిక తీసి వెడల్పు చేస్తామన్నారు.. అందరిలాగే తాను మాటల మంత్రిని కాదని ఆయన చెప్పుకొచ్చారు.. తాను మాటిస్తే నెరవేర్చి తీరుతానన్నారు. ఎన్టీయార్ ఇళ్లు పూర్తవగానే కాలువల మీద ఉన్న వారిని తరలించి వరద సమస్యను పరిష్కరిస్తామని ఆయన వెల్లడించారు.

Reviewed by ADMIN
on
November 11, 2017
Rating:
No comments: