మీరు దైర్యంగా పంటలు వేసుకోండి... ధర్నా చేసైనా నీరు తీసుకొస్తా - జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి
THE BULLET NEWS (VENKATAGIRI)-కండలేరు జలాశయం కింద సాగు చేసుకునే రైతులు ఈసారి కూడా ధైర్యంగా పంటలు వేసుకోవాలని... అవసరమైతే ధర్నా చేసైనా నీరు తీసుకొస్తానని వెంకటగిరి నియోజక వర్గ ప్రజలకు జడ్పీ ఛైర్మన్, వైసీపీ సమన్వయకర్త బొమ్మి రెడ్డి రాఘవేంద్ర రెడ్డి ప్రజలకు భరోసా ఇచ్చారు.. వెంకటగిరి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో మీడియాతో మాట్లాడారు..
కండలేరు జలాశయం కింద సాగు చేసుకునే ఆయకట్టు రైతులకు ప్రభుత్వం అండగా ఉండాలన్నారు.. కండలేరు జలాశయానికి వెంటనే నీరు విడుదల చేయాలన్నారు.. చివరి ఆయాకట్టు వరకు నీరు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ధర్నాకు సైతం దిగేందుకు వెనుకాడబోనని ఆయన హెచ్చరించారు.. మొన్న జరిగిన ఐఓబీ సమావేశంలో కూడా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రస్తావించానన్నారు.. ప్రస్తుతం కండలేరులో దాదాపు 15 టీఎంసీల నీరుందన్న ఆయన వాటిని కండలేరు ఆయకట్టు రైతులకు ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేశారు...
కండలేరు జలాశయం కింద సాగు చేసుకునే ఆయకట్టు రైతులకు ప్రభుత్వం అండగా ఉండాలన్నారు.. కండలేరు జలాశయానికి వెంటనే నీరు విడుదల చేయాలన్నారు.. చివరి ఆయాకట్టు వరకు నీరు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ధర్నాకు సైతం దిగేందుకు వెనుకాడబోనని ఆయన హెచ్చరించారు.. మొన్న జరిగిన ఐఓబీ సమావేశంలో కూడా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రస్తావించానన్నారు.. ప్రస్తుతం కండలేరులో దాదాపు 15 టీఎంసీల నీరుందన్న ఆయన వాటిని కండలేరు ఆయకట్టు రైతులకు ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేశారు...
మీరు దైర్యంగా పంటలు వేసుకోండి... ధర్నా చేసైనా నీరు తీసుకొస్తా - జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి
Reviewed by ADMIN
on
November 02, 2017
Rating:
No comments: