జగన్.. ని పాదయాత్రల వల్ల ప్రజలు విసిగిపోతున్నారు..- కళా కామెంట్...
THE BULLET NEWS (AMARAVATHI)- వైసీపీ అధినేత జగన్‌పై మంత్రి కళా వెంకట్రావు పలు విమర్శలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసుల నుంచి తప్పించుకునేందుకే జగన్ పాదయాత్ర చేస్తున్నారని అన్నారు. కొందరు నేతలు మరో దారి లేక జగన్ వెంట ఉంటున్నారని ఎద్దేవా చేశారు. పాలసీల గురించి ఏమాత్రం ఆలోచన లేని వ్యక్తి జగన్ అని, ప్రజా సమస్యలపై ఫోకస్ పెట్టడం జగన్ డిక్షనరీలోనే లేదన్నారు. జగన్ వ్యవహారాలు ఒక్కొక్కటి గా భయటపడుతున్నాయని ఆయన అన్నారు. ఆర్థిక నేరగాళ్ల జాబితాలో ఉన్న జగన్‌కు పార్టీ నడిపే అర్హత ఉందా.. లేదా.. అని ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్థిక నేరస్తుల జాబితా లో మన రాష్ట్రం నుండి జగన్ 10 వ స్థానంలో ఉన్నాడని అసలు కేసుల నుండి భయటపడడానికే పార్టీ పెట్టడానిపిస్తుంది పేర్కొన్నారు. మనీ లాండరింగ్ ద్వారా 31 షెల్ కంపెనీల్లో 368 కోట్ల అవినీతికి జగన్ పాల్పడ్డాడని తెలిపారు. ఇలాంటి చరిత్ర కలిగి వాళ్లు రాజకీయల్లోకి రావడం సిగ్గు చేటు అని అన్నారు.
జగన్.. ని పాదయాత్రల వల్ల ప్రజలు విసిగిపోతున్నారు..- కళా కామెంట్...
Reviewed by ADMIN
on
November 23, 2017
Rating:
No comments: