మంత్రి చొరవతో చెరుకు రైతులకు బకాయిలు చెల్లింపు..
THE BULLET NEWS (AMARAVATHI)-పరిశ్రమల శాఖ మంత్రి ఎన్ అమరనాథ రెడ్డి ఇటీవల వరుసగా నిర్వహించిన సమీక్షల ఫలితంగా 2014-15 సంవత్సరానికి సంబంధించిన చెరుకు ధర బకాయిలు రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా జమ అయ్యాయి. చిత్తూరు జిల్లాలోని శ్రీ వెంకటేశ్వర సహకార చక్కెర కర్మాగారంకు చెందిన 1376 మంది చెరుకు రైతులకు చెల్లించాల్సిన రూ. 13.50 కోట్లు, విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి వివి రమణ సహకార చక్కెర కర్మాగారంనకు చెందిన 1900 మంది చెరుకు రైతులకు చెల్లించాల్సిన రూ. 1.99 కోట్లు వెరసి, మొత్తం 3276 రైతులకు రూ. 15.49 కోట్లను ప్రభుత్వం విడుదల చేసినట్టు చక్కెర సంచాలకులు, చెరుకు కమిషనరు ఎల్ మురళి తెలిపారు. ఈ మొత్తం బకాయిలను సంబంధిత చెరుకు రైతుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా జమచేసినట్టు ఆయన తెలిపారు.
మంత్రి చొరవతో చెరుకు రైతులకు బకాయిలు చెల్లింపు..
Reviewed by ADMIN
on
November 22, 2017
Rating:
No comments: