జగన్ పాదయాత్రకు భారీగా తరలివెళ్లిన జిల్లా నేతలు..
The Bullet News ( Nellore ) _ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతం కావాలని జిల్లా వ్యాప్తంగా వైసీపీ నేతలు, కార్యకర్తలు దేవాలయాలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మసీదుల్లో ప్రార్దనలు నిర్వహిస్తున్నారు.. నిన్న ఇడుపులపాయ నుంచి ప్రారంభించిన ఈ యాత్రకు జిల్లా నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు.. ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైసీపీ జిల్లా అద్యక్షులు, సర్వేపల్లి ఎమ్మెల్యే సర్వేపల్లి గోవర్దన్ రెడ్డి, నెల్లూరుసిటి ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, వెంకటగిరి నియోజకవర్గ సమన్వయ కర్త, జడ్పీ చైర్మన్ బొమిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యే గౌతమ్ రెడ్డి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళీధర్, కలువాయి జడ్పీటీసీ అనిల్ కుమార్ రెడ్డి, వెంకటగిరి టౌన్ కన్వీనర్ ఢిల్లీబాబు రాజారెడ్డి, గురుప్రసాద్, డక్కిలి మండలం కన్వీనర్ రంగినేని రాజా, సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు..
ప్రత్యేక పూజలు :
కడపజిల్లా గండిలోని శ్రీ ఆంజనేయస్వామికి జడ్పీ చైర్మన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సాహసయాత్రను అందరూ ఆదరించి, విజయవంతం అయ్యేందుకు క్రుషి చేయాలన్నారు.. రాష్టంలో జరుగుతున్న అవినీతి పాలనకు ఈ పాదయాత్ర చరమగీతం పాడబోతోందని బొమ్మిరెడ్డి జోస్యం చెప్పారు.. పాదయాత్రతో టీడీపీలో గుబులు మొదలైందని అందుకే చౌకబారు విమర్శలు చేస్తున్నారని విమర్శించారు..
కాకాణి మాట్లాడుతూ వైఎస్సార్ పాలన రావాలంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్ర అవ్వాలని రాష్ట ప్రజలు భావిస్తున్నారన్నారు.. జగన్మోహన్ రెడ్డిని ఆదరించి అవకాశమిచ్చేందుకు రాష్ట ప్రజలు సిద్దంగా ఉన్నారన్నారు..

Reviewed by ADMIN
on
November 07, 2017
Rating:
No comments: