Top Ad unit 728 × 90

నీరివ్వకుంటే ధర్నాకు దిగుతా - జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి

The Bullet News ( Dakkili )_ జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి చేపడుతున్న రచ్చ బండ, పల్లె నిద్ర కు ప్రజలనుంచి అపూర్వ స్పందన లభిస్తోంది.. రామసాగరం పంచాయితీలో ఇంటింటికి తిరిగి అందరిని ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పుడున్న పరిస్థితుల్లో వెంకటగిరి నియోజకవర్గ పరిధిలోని పంట పొలాలకు నీరు అందించడంలో ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.. గతేడాది అంచనాల ప్రకారం ప్రభుత్వం నీటిని అందించిందని కానీ ప్రస్తుతం నీటిని విడుదల చెయ్యటం లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు.. ఈ విషయంలో ఎమ్మెల్యే పూర్తిగా విఫలమయ్యారని ఆయన మండిపడ్డారు.. వారం రోజుల్లో వెంకటగిరి నియోజకవర్గం ఆయకట్టు కింద పొలాలకు నీరు అందివ్వకపోతే ధర్నా చేసేందుకు సైతం వెనకాడే ప్రసక్తే లేదన్నారు.. ఈ కార్యక్రమంలో జిల్లా ట్రేడ్ యూనియన్ నాయకులు నోటి రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు...
నీరివ్వకుంటే ధర్నాకు దిగుతా - జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి Reviewed by ADMIN on November 18, 2017 Rating: 5

No comments:

All Rights Reserved by nagendra © 2014 - 2015
Powered By Blogger, Share by Star Tuan

Biểu mẫu liên hệ

Name

Email *

Message *

Powered by Blogger.